Share News

అవిశ్వాసం పెడితే ఉలుకెందుకు?

ABN , Publish Date - Apr 15 , 2025 | 11:54 PM

తమ పార్టీ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం పెడితే మీకు ఉలుకెందుకని ఎమ్మెల్యే పారథిని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌ ప్రశ్నించారు. బీజేపీలో చేరి, తిరిగి సొంత గూటికి వచ్చిన వైసీపీ కౌన్సిలర్‌ వాసీమ్‌కు కండువా కప్పి పార్టాలోకి ఆహ్వానించారు.

అవిశ్వాసం పెడితే ఉలుకెందుకు?
పార్టీలోకి కౌన్సిలర్‌ని ఆహ్వానిస్తున్న మాజీ ఎమ్మెల్యే

ఎమ్మెల్యే ప్రజలను మభ్య పెడుతున్నారు

మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌ రెడ్డి

ఆదోని అగ్రికల్చర్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్ర జ్యోతి): తమ పార్టీ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం పెడితే మీకు ఉలుకెందుకని ఎమ్మెల్యే పారథిని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌ ప్రశ్నించారు. బీజేపీలో చేరి, తిరిగి సొంత గూటికి వచ్చిన వైసీపీ కౌన్సిలర్‌ వాసీమ్‌కు కండువా కప్పి పార్టాలోకి ఆహ్వానించారు. పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకు రాకుండా ఎమ్మెల్యే పార్థసారథి మాటలతోనే కాలయాపన చేస్తున్నారన్నారు. వైసీపీ కౌన్సిలర్లకు డబ్బు ఆశ చూపి బీజేపీలో చేర్చుకున్నార న్నారు. వారు బీజేపీలో ఉన్నా, తిరిగి తమకే మద్దతు ఇస్తున్నారన్నారు. ప్రజలు మార్పు కోసం కూటమిని అధికారం లోకి తెస్తే దౌర్జన్యాలు, వసూళ్ల దందాలు బెదిరింపులతో ప్రజలను విసిగిస్తున్నారన్నారు. ఇకనైనా వీటికి స్వస్తి పలికి నియోజకవర్గ అభివృద్ధికి పాటుప డాలని హితవు పలికారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్‌ మధుసూదన్‌ వైసీపీ పట్టణ గౌరవ అధ్యక్షుడు చంద్రకాంత్‌ రెడ్డి, వైస్‌ చైర్మన్‌ నరసింహులు, కౌన్సిలర్‌ సందీప్‌ రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2025 | 11:54 PM