Share News

ఆ ఉపాధ్యాయుడి తప్పేటి?

ABN , Publish Date - Oct 11 , 2025 | 12:01 AM

ఆ ఉపాధ్యాయుడు చేసిన తప్పేటి? విద్యార్థి ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేయడమా.. ప్రత్యేక శ్రద్ధ చూపి చదువు చెప్పడమా.. విద్యార్థి పాఠశాలకు రాకపోతే పిల్లలను వారింటికి పంపి వాకబు చేయడమా? ఇదేనా అతను చేసిన తప్పు. దీనికి ప్రతిఫలమేనా కర్రతో దాడి. గురువు అని కూడా చూడకుండా విద్యార్థి తండ్రి కర్రతో దాడిచేసిన ఘటన మండలంలోని గాజులదిన్నె గ్రామంలో చోటుచేసుకుంది.

ఆ ఉపాధ్యాయుడి తప్పేటి?
పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న ఉపాధ్యాయులు, ఇన్‌సెట్‌లో గాయపడ్డ ఉపాధ్యాయుడు బసవరాజు

గోనెగండ్ల, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): ఆ ఉపాధ్యాయుడు చేసిన తప్పేటి? విద్యార్థి ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేయడమా.. ప్రత్యేక శ్రద్ధ చూపి చదువు చెప్పడమా.. విద్యార్థి పాఠశాలకు రాకపోతే పిల్లలను వారింటికి పంపి వాకబు చేయడమా? ఇదేనా అతను చేసిన తప్పు. దీనికి ప్రతిఫలమేనా కర్రతో దాడి. గురువు అని కూడా చూడకుండా విద్యార్థి తండ్రి కర్రతో దాడిచేసిన ఘటన మండలంలోని గాజులదిన్నె గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, విద్యా శాఖాధికారులు తెలిపిన వివరాలు.. కర్నూలుకు చెందిన బసవరాజు ఎనిమిదేళ్లుగా గాజులదిన్నె ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అదే కాలనీకి చెందిన మీసాల రంగస్వామి కుమారుడు హర్షవర్ధన్‌ మానసిక దివ్యాంగుడు. పాఠశాలలో నాలుగో తరగతి చదువుతు న్నాడు. బసవరాజు ఆవిద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని విద్యా బోధన చేసేవాడు. కొన్ని రోజులుగా హర్షవర్ధన్‌ పాఠశాలకు రావడంలేదు. దీంతో ఉపాధ్యాయుడు పాఠశాలకు చెందిన ఇతర పిల్లలను హర్షవర్ధన్‌ ఇంటికి పంపాడు. దీంతో విద్యార్థి తండ్రి ఆగ్రహంతో ఊగిపోయాడు. శుక్రవారం బసవరాజు పాఠశాలకు వస్తుండగా మీసాల రంగస్వామి కర్రతో దాడి చేశాడు. దీంతో తలకు, ముక్కుకు గాయాలయ్యాయి. ఘటనను గమనించిన కాలనీవాసులు దాడిని అడ్డుకున్నారు. తోటి ఉపాధ్యాయులు, కాలసీవాసులు చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభు త్వాస్పత్రికి తరలించారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఎంఈవో రామాంజినేయులు, నీలకంఠ, పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ విజయభాస్కర్‌ విచారణ చేసి మీసాల రంగస్వామిపై దాడి కేసు నమోదు చేశారు.

బదిలీ అయిన చివరి రోజే దాడి..

గాజులదిన్నెలో ఎనిమిదేళ్లుగా పనిచేయడంతో బసవారాజును లాంగ్‌ స్టాండింగ్‌ కింద కోడుమూరుకు బదిలీ అయ్యాడు. గాజులదిన్నెలో శుక్రవారం చివరి రోజు విధులు నిర్వహించేందుకు రాగా దాడి జరిగింది. సోమవారం కోడుమూరులో జాయిన్‌ కావాల్సి ఉంది.

Updated Date - Oct 11 , 2025 | 12:01 AM