ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలి
ABN , Publish Date - Dec 18 , 2025 | 12:32 AM
రైతులు రబీలో ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని ఏడీఏ సుధాకర్ సూచిం చారు.
అవుకు, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): రైతులు రబీలో ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని ఏడీఏ సుధాకర్ సూచిం చారు. బుధవారం అవుకు రైతు సేవా కేంద్రంలో వ్యవసా యాధి కారి కలిమున్నీసా అధ్యక్షతన రైతు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఏడీఏ మాట్లాడుతూ అవుకు రిజర్వాయర్ మరమ్మతుల కారణంగా 2 టీఎంసీలు నీరు మాత్రమే ఉందన్నారు. వరి పం టకు బదులు ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలన్నారు. ఆత్మ బీటీఎం హరిబాబు, వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.