Share News

ముస్తాబైన ఆలయాలు

ABN , Publish Date - Dec 30 , 2025 | 12:19 AM

మండలంలోని మూడురా ళ్లపల్లె, చాగలమర్రి, మద్దూరు గ్రామాల్లోని చెన్నకేశవ, వెంకటేశ్వర స్వామి, ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయాలను వైకుంఠ ఏకాదశి సంద ర్భంగా ముస్తాబు చేశారు.

ముస్తాబైన ఆలయాలు
అవుకు: ముస్తాబైన చెన్నకేశవస్వామి ఆలయం

నేడు వైకుంఠ ఏకాదశి

చాగలమర్రి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): మండలంలోని మూడురా ళ్లపల్లె, చాగలమర్రి, మద్దూరు గ్రామాల్లోని చెన్నకేశవ, వెంకటేశ్వర స్వామి, ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయాలను వైకుంఠ ఏకాదశి సంద ర్భంగా ముస్తాబు చేశారు. మంగళవారం ఉత్తర ద్వార దర్శనం వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయాలను విద్యుత బల్బులతో అలంకరించారు.

అవుకు: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని అవుకు పట్టణంలో వెలసిన అతిపురాతనమైన భూలక్ష్మీ సమేత చెన్నకేశవస్వామి, నవాజ్‌ కొం డపై వెలసిన మద్దిలేటిస్వామి ఆలయాలను సుందరంగా అలంక రించారు. ఆలయాలకు భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో ఉత్తర ద్వారం నుంచి ఆలయ గర్భగుడి వరకు బారికేట్లు, క్యూలైన్లను ఏర్పాటు చేశారు. తెల్లవారుఝాము నుంచే భక్తులకు ఉత్తర ద్వారం నుంచి స్వామి వారిని దర్శించుకొనే అవకాశం కల్పిం చారు. అనంతరం ప్రత్యేక పల్లకిలో ఉత్సవమూర్తులను అలంకరించి గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఆలయాల్లో తిరుమల, తిరుపతి దేవస్థానా నికి చెందిన సభ్యులు అన్న మాచార్య కీర్తనలు, హరికథలను వినిపించే ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహ కులు తెలిపారు.

బేతంచెర్ల: మండలంలోని ఆర్‌ఎస్‌ రంగాపురం గ్రామ శివారులో వెలిసిన మద్దిలేటి నరసింహ స్వామి క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి వేడుకలకు సర్వం సిద్ధం చేసినట్లు ఆలయ ఈవో రామాంజనేయులు సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ స్వామి అమ్మవార్లకు ఉదయం నిత్య పూజలతోపాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, తెల్లవారుజామున 4.30 గంటలకు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనం కలిస్తామన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఉదయం 11 గంటలకు స్వామి వారి కల్యాణం జరుగుతుందని తెలిపార

బనగానపల్లె: పట్టణంలోని కొండపేటలోని వేంకటేశ్వరస్వామి ఆలయం ప్రాంగణంలో మంగళవారం నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి వేడుకలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి, దంపతులు తమ సొంత నిధులతో వేడుకలను నిర్వహిస్తున్నారు. సోమవారం సాయంత్రం సీఐ ప్రవీణ్‌కుమార్‌, పోలీస్‌ సిబ్బంది, మంత్రి పీఏ విష్ణువర్దనరెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు.

ఉయ్యాలవాడ: మండలంలోని ఆయా గ్రామాల్లో మంగళవారం జరిగే ముక్కోటి ఏకాదశి వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. ఆయా ఆలయాలను విద్యుత దీపాలతో ప్రత్యేకంగా అలం కరించారు. మంగళవారం మండ లంలోని ఇంజేడు గ్రామంలో వేంకటే శ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేయ నున్నారు.

Updated Date - Dec 30 , 2025 | 12:38 AM