Share News

నీటి సమస్య తలెత్తకుండా చూస్తాం

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:09 AM

వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూస్తామని టీడీపీ ఇన్‌చార్జి వీరభద్ర గౌడ్‌ తెలిపారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు.

నీటి సమస్య తలెత్తకుండా చూస్తాం
తాగు నీటి సమస్యపై వీరభద్ర గౌడ్‌కు విన్నవిస్తున్నఅరికెర గ్రామ సర్పంచ్‌ నాగరాజు

ఆలూరు, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూస్తామని టీడీపీ ఇన్‌చార్జి వీరభద్ర గౌడ్‌ తెలిపారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. తమ గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని అరికెర గ్రామ సర్పంచ్‌ నాగరాజు విన్నవించారు. పోరంబోకు స్థలాలను దళితులకు కేటాయించాలని దళిత సంఘం నాయకులు మసాలా జగన్‌, ఉలిగప్ప, గోవింద్‌ విన్నవించారు. సమస్యలను సంబంధిత శాఖలకు పంపి పరిష్కారమేయ్యలా కృషి చేస్తామని తెలిపారు. వేదవతి, నగరడోన ప్రాజెక్టులు నిర్మించేందుకు నిధులు విడుదల చేయాలని జిల్లాకు వచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడును కోరినట్లు తెలిపారు. పల్లె పండుగ నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీ, గోకులం షెడ్లు నిర్మించామని తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అభివృద్ధికి అడుగులు వేస్తూ పాలనలో ముందుకు సాగుతుందన్నారు. కన్వీనర్‌ అశోక్‌, మార్కెట్‌ యార్డ్‌ మాజీ చైర్మెన్‌ రామ్‌నాథ్‌ యాదవ్‌, అట్టేకల్‌ బాబు, సురేంద్ర, తిమ్మయ్య, నరసప్ప, మల్లికార్జున రెడ్డి, సోమశేఖర్‌, రామాంజినేయులు, హనుమప్ప, మల్లేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2025 | 12:09 AM