Share News

పేదలకు సంక్షేమ పథకాలు

ABN , Publish Date - Jul 06 , 2025 | 11:45 PM

గ్రామాల్లో పేదలకు సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులు చేస్తున్నామని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర, జడ్పీ మాజీ చైర్మన్‌ బత్తిన వెంకట్రాముడు అన్నారు

పేదలకు సంక్షేమ పథకాలు
శభాష్‌ఫురంలో ప్రభుత్వ పథకాలను వివరిస్తున్న నాయకులు

తుగ్గలి, జూలై 6 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో పేదలకు సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులు చేస్తున్నామని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర, జడ్పీ మాజీ చైర్మన్‌ బత్తిన వెంకట్రాముడు అన్నారు. ఆదివారం శభాష్‌పురంలో ‘తొలి అడుగు’ నిర్వహించి ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందించిన పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్రామాల్లో సీసీ రోడ్లు వేశామని, బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ‘తల్లికి వందనం’అమలు చేశామన్నారు. రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తామన్నారు. సీఎం చంద్ర బాబు సహకారంతో ఎమ్మెల్యే శ్యాంబాబు అభివృద్ధి పనులు చేస్తు న్నారన్నారు. తిరుపాల్‌ నాయుడు, వెంకటస్వామి, శ్రీనివాసులు గౌడు, మిద్దె వెంకటేశ్‌ యాదవ్‌, మోహన్‌, శ్రీరాములు, ఆదినారాయణ, సొసైటీ డైరెక్టర్‌ చిన్న పెద్దయ్య, సోమశేఖర్‌గౌడ్‌ ఉన్నారు.

Updated Date - Jul 06 , 2025 | 11:45 PM