Share News

సంక్షేమ పథకాలు అమలు చేయాలి

ABN , Publish Date - Jun 07 , 2025 | 12:14 AM

ఇంజనీరింగ్‌ కార్మికు లకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఏపీ మున్సిపల్‌ ఇంజనీ రింగ్‌ వర్కర్స్‌ యూనియన నగర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు.

 సంక్షేమ పథకాలు అమలు చేయాలి
కార్పొరేషన కార్యాలయం ఎదుట వంటా చేస్తున్న కార్మికులు

కార్పొరేషన కార్యాలయం ఎదుట ఇంజనీరింగ్‌ కార్మికుల వంటా వార్పు

కర్నూలు న్యూసిటీ, జూన 6(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ కార్మికు లకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఏపీ మున్సిపల్‌ ఇంజనీ రింగ్‌ వర్కర్స్‌ యూనియన నగర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కార్పొరేషన కార్యాలయం ఎదుట కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం మూడో రోజుకి చేరింది. ఇందెలో భాగంగా కార్మికులు వంటా వార్పు చేసుకుని అక్కడే భోజనాలు చేశారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్మికులందరికీ కనీస వేతనం రూ.24.500 ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. న్యాయ మైన డిమాండ్లను పరిష్కరించని పక్షంలో నీటి సరఫరా, వీధి దీపాలు ఆపేస్తామని హెచ్చరించారు.. కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి సమీర్‌ బాషా, ఉపాధ్యక్షుడు నాగశేషులు, జిల్లా అధ్యక్షుడు మనోహర్‌, కార్య దర్శి యాసినబేగ్‌, గంగమ్మ పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2025 | 12:14 AM