ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు
ABN , Publish Date - Jul 05 , 2025 | 12:11 AM
కూటమి ఏడాది పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు.
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత
అశోక్‌నగర్‌లో ‘తొలి అడుగు’
కర్నూలు అర్బన, జూలై 4 (ఆంధ్రజ్యోతి): కూటమి ఏడాది పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు. శుక్రవారం నగరంలోని 45వ వార్డు అశోక్ నగర్‌లో ‘తొలి అడుగు’ నిర్వహించారు. మంత్రి ఇంటింటికీ వెళ్లి సంక్షేమం, అభివృద్ధిని వివరించారు. మహిళలు, వృద్ధులు, విద్యార్థులతో మాట్లాడి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసు కున్నారు. నగరంలో రోడ్ల వెడల్పు పనులు చెప్పట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. చైతన్య నగర్‌లో ప్రమాదకరంగా ఉన్న ట్రాన్సఫార్మర్‌కు ప్రహరీ ఏర్పాటు చేస్తామని మంత్రి కాలనీ వాసులకు హమీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీటీ నాయుడు, కుడా చైర్మన సోమిశెట్టి వెంకటేశ్వర్లు, డైరెక్టర్లు సంజీవ లక్ష్మి, ధరూర్ జేమ్స్, ముంతాజ్, నాయకులు ఆకెపోగు ప్రభాకర్, కార్పొరేటర్లు మాణిక్యమ్మ, పరమేష్, మాజీ కార్పొరేటర్లు సుంకన్న పాల్గొన్నారు.