Share News

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

ABN , Publish Date - Sep 02 , 2025 | 12:36 AM

కూటమి ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు
లక్ష్మీపురంలో పింఛన పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే గౌరు చరిత

ఎమ్మెల్యే గౌరు చరిత

లక్ష్మీపురంలో పింఛన్లు పంపిణీ

కల్లూరు, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. సోమవారం 28వ వార్డు లక్ష్మీపురంలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందులున్నా ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్‌సిక్స్‌ పథకా లను అమలు చేస్తున్నారన్నారు. ఇప్పటికే పింఛన పెంపుతోపాటు, మోగా డీఎస్సీ, మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు, తల్లికి వందనం, ఉచిత బస్‌ ప్రయాణం, అన్నదాతా సుఖీభవ అమలు చేశా రన్నారు. అనంతరం లబ్ధిదారులకు ఎమ్మెల్యే పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డి.రామాంజనేయులు, ఈవీ.రమణ, పుల్లారెడ్డి, మారెన్న, శివ, శేఖర్‌చౌదరి, దొడ్డిపాడు బాషా పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2025 | 12:36 AM