Share News

సంక్షేమమే లక్ష్యం

ABN , Publish Date - May 06 , 2025 | 12:20 AM

రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు

సంక్షేమమే లక్ష్యం
భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే శ్యాంబాబు

ఎమ్మెల్యే శ్యాంబాబు

సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి భూమిపూజ

మద్దికెర, మే 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. సోమవారం మండలంలోని పెరవలి గ్రామంలో 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. 75 సెంట్ల స్థలం ఇచ్చిన పెరవలి గ్రామా నికి చెందిన దాత ఈడిగ రంగన్నను సన్మానించారు. సబ్‌ స్టేషన్‌ ఏర్పాటుతో పెరవలి, బసినేపల్లి, మదనం తపురం, రాంపురం, రాంపురం కొట్టాల్లో విద్యు త్‌ అంతరాయం, లోవోల్టేజీ సమస్య ఉండదన్నారు. ఉమ్మడి జిల్లాలో ఇంత వరకు ఏ మండలానికి కూడా సబ్‌ స్టేషన్‌ మంజూరు కాలేదని, సీఎం చంద్రబాబు చొరవతో విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ను మంజూరు చేశారన్నారు. జూన్‌లో తల్లికి వందనం పేరుతో కుటుంబంలో ఎంత మంది విద్యార్థులు చదువుతుంటే అందరికీ రూ.15 వేలు అందజేస్తున్నట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి నోచుకోక రాష్ట్రం అల్లకల్లోలమైందన్నారు. ప్రధాని మోదీ సారఽథ్యంలో రాజధాని అమరావతి అభివృద్ధిలో పరుగులు తీస్తుందన్నారు. గడిచిన పది నెలల్లో సంక్షేమం, అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నామన్నారు. మద్దికెర మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి 7వేల మంది రైతులకు పంట నష్టపరిహారం అందిస్తున్నా మని, హంద్రీనీవా నీటితో చెరువు లను నింపేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో విద్యుత్‌ ఎస్‌ఈ ఉమాపతి, ఏఈ మహ్మద్‌ రఫీక్‌, తహసీల్దార్‌ హుశేన్‌ సాహేబ్‌, మాజీ జడ్పీటీసీ సభ్యులు పురుషోత్తం చౌదరి, ప్రముఖ నాయకుడు పారా విశ్వనాథ్‌, సర్పంచ్‌ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2025 | 12:20 AM