అర్జున్ కుటుంబాన్ని ఆదుకుంటాం
ABN , Publish Date - Oct 18 , 2025 | 12:23 AM
మోదీ సభకు వస్తూ విద్యుదాఘాతంతో మృతిచెందిన అర్జున్ కుటుం బాన్ని ప్రభుత్వం తరుపున ఆదుకుంటామని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్రనరసింహరెడ్డి భరోసానిచ్చారు.
విద్యుత్ శాఖ నుంచి రూ.5లక్షలు అందజేత
కర్నూలు రూరల్ అక్టోబరు17(ఆంధ్రజ్యోతి): మోదీ సభకు వస్తూ విద్యుదాఘాతంతో మృతిచెందిన అర్జున్ కుటుం బాన్ని ప్రభుత్వం తరుపున ఆదుకుంటామని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్రనరసింహరెడ్డి భరోసానిచ్చారు. శుక్రవారం మునగాలపాడులో భౌతికాయానికి నివాళి అర్పించారు. అనంతరం తల్లిదండ్రులు మద్దిలేటి, రాణేమ్మను ఓదార్చారు. విద్యుత్ శాఖ తరుపున రూ.5లక్షలను విద్యుత్ ఎస్‌ఈ ఆర్.ప్రదీప్‌కుమార్‌తో కలిసి అందజేశారు. మట్టి ఖర్చులకు రూ.20వేలు ఇచ్చారు. గాయలతో బయటపడిన క్షతగాత్రులను ఎమ్మెల్యేలు పరామర్శించి ప్రమాద ఘటనను అడిగితెలుసుకున్నారు. క్షతగాత్రులకు ఇద్దరికి ఎమ్మెల్యేలు రూ.10వేల చొప్పున అందజేశారు. మెరుగైన వైద్యం అందిస్తామని వారు క్షతగాత్రులకు హామీ ఇచ్చారు.