ప్రథమ నందీశ్వర ఆలయాభివృద్ధికి కృషి చేస్తా
ABN , Publish Date - Jun 12 , 2025 | 12:22 AM
ప్రథమ నందీశ్వర ఆలయాభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు.
రాష్ట్ర న్యాయ, మైనార్టీశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్
ఘన స్వాగతం పలికిన అర్చకులు, అధికారులు
నంద్యాల కల్చరల్, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): ప్రథమ నందీశ్వర ఆలయాభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు. బుధవారం ప్రథమ నందీశ్వర ఆలయంలో కొత్తగా నిర్మిస్తున్న వంటశాల, నూతన బోరెవెల్, అసంపూర్తిగా ఉన్న గదుల నిర్మాణానికి మంత్రి ఫరూక్ భూమి పూజ చేశారు. ముందుగా ఆలయ అర్చకులు, అధికారులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఫరూక్ తనయుడు ఫిరోజ్‌తో కలిసి స్వామివారికి అభిషేకం నిర్వహించి పూజలు చేశారు. భూమి పూజ అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి పాల్గొని మా ట్లాడారు. భవిష్యత్తులో దేవస్థానంలో ట్యాంక్, ఉత్తరం, తూర్పు వైపున మాడవీధులు అలాగే దేవస్ధానానికి చెందిన స్ధలాన్ని కొలతలు వేయించి ప్రహరీ నిర్మాణం కోసం తనవంతు కృషిచేస్తా నన్నారు. దేవస్ధానంలోని కల్యాణమండపం రాజకీయ నాయకుడి పేరుపై ఉండటం సబబు కాదన్నారు. కల్యాణమండపాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆలయ అధికారి రామానుజానికి సూచించారు. మంత్రికి తెలిపి త్వరలో స్వాధీనం చేసుకుం టామని ఈవో తెలిపారు. టీడీపీ 32వార్డు ఇన్‌చార్జి బుడంకాయల శేఖర్ ఒక గదికి, శేశిరెడ్డి ఒక గది నిర్మాణానికి ముందుకొచ్చారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ఖండే శ్యామ్‌సుందర్‌లాల్, చలంబాబు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు రామశివారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రజనీకాంత్ రెడ్డి, కృష్ణారెడ్డి, వరప్రసాద్, నరసింహులు, సుధాకర్, రమణ పాల్గొన్నారు.