రాజకీయ పార్టీల సలహాలను పరిగణనలోకి తీసుకుంటాం
ABN , Publish Date - Mar 14 , 2025 | 12:32 AM
రాజకీయ పార్టీలు తెలిపే సలహాలు, సూచనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కర్నూలు నియోజకవర్గ ఎన్ని కల రిటర్నింగ్ అధికారి, కార్పొరేషన కమిషనర్ ఎస్.రవీంద్రబాబు అన్నారు.

కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి రవీంద్రబాబు
కర్నూలు న్యూసిటీ, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): రాజకీయ పార్టీలు తెలిపే సలహాలు, సూచనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కర్నూలు నియోజకవర్గ ఎన్ని కల రిటర్నింగ్ అధికారి, కార్పొరేషన కమిషనర్ ఎస్.రవీంద్రబాబు అన్నారు. గురువారం నగర పాలక కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెలా మొదటి వారంలో రాజకీయ ప్రతినిధుల సమావేశం జరుగుతుందన్నారు. సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇచ్చే సలహాలు, సూచనలు, అభ్యంతరా లను పరిశీలించి ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామన్నారు. సమావే శంలో ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు పలు సమస్యలను లేవనె త్తారు. జోహరాపురం సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో పోలింగ్ కేం ద్రం లేక జోహరాపురం 257, 258వ పోలింగ్ కేంద్రాలకు వెళ్లాల్సి వస్తుం దని, వాటిని దృష్టిలో ఉంచుకుని ఇందిరమ్మ కాలనీలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, సీపీఎం ఇతర పార్టీల ప్రతి నిధులు ఆర్వో దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్ల జాబితాలో చిరునామా, నగర పాలక ఇంటి నెంబర్లు కొత్తవి గందరగోళంగా ఉందని తెలిపారు. ఈ సమావేశంలో తహసీల్దార్ వెంకటలక్ష్మి, డిటీ డబ్లూ ధనుంజయ్, సూప రింటెండెంట్లు సుబ్బన్న పాల్గొన్నారు.