Share News

బాధితులను ఆదుకుంటాం

ABN , Publish Date - Oct 15 , 2025 | 11:54 PM

దొర్నిపాడు గ్రామానికి చెందిన బాసిరెడ్డి వీరారెడ్డ్డి, అతడి అల్లుళ్లు రాజారెడ్డి, మహేశ్వర్‌రెడ్డిలు హెల్త్‌ అండ్‌వెల్త్‌ ఫైనాన్సియల్‌ కంపెనీలో ప్రజలు డబ్బులు కట్టి మోస పోయిన బాధితులను ఆదుకుంటామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు.

బాధితులను ఆదుకుంటాం
బాధితులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

దొర్నిపాడు, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): దొర్నిపాడు గ్రామానికి చెందిన బాసిరెడ్డి వీరారెడ్డ్డి, అతడి అల్లుళ్లు రాజారెడ్డి, మహేశ్వర్‌రెడ్డిలు హెల్త్‌ అండ్‌వెల్త్‌ ఫైనాన్సియల్‌ కంపెనీలో ప్రజలు డబ్బులు కట్టి మోస పోయిన బాధితులను ఆదుకుంటామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. బాధితుల వద్దకు వెళ్లి జరిగిన మోసంపై ఆరా తీశారు. తాము లక్షలాది రూపాయలు డబ్బులు పెట్టి నష్టపోయామని తమను ఆదుకో వాలని బాధితులు ఎమ్మెల్యేను కోరారు. నిందితుల వద్ద నుంచి తమ డబ్బులు ఇప్పించేలా చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. డబ్బులు కట్టి మోసపోయిన ప్రతి ఒక్కరు ఆధారాలతో పోలీసు స్టేషనలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈవిషయాన్ని పోలీసు ఉన్నాతా ధి కారుల దృష్టికి తీసుకెళ్లి నిందితులపై చర్యలు తీసుకునేలా చూస్తాన న్నారు. మోసపూరిత కంపెనీలను నమ్మి యువత మోసపోరాదని అన్నారు.

Updated Date - Oct 15 , 2025 | 11:54 PM