Share News

నాపరాళ్ల పరిశ్రమను ఆదుకుంటాం

ABN , Publish Date - Oct 31 , 2025 | 11:40 PM

నాపరాళ్ల పరిశ్రమను ఆదుకుంటామని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

నాపరాళ్ల పరిశ్రమను ఆదుకుంటాం
మాట్లాడుతున్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

రాయల్టీ విషయంపై సీఎంతో చర్చిస్తా

రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

కొలిమిగుండ్ల, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి) : నాపరాళ్ల పరిశ్రమను ఆదుకుంటామని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని బెలుంగుహల ఆవరణంలో నంద్యాల, అనంతపురం జిల్లాలకు చెందిన నాపరాళ్ల గనులు, పాలిషింగ్‌ యూనిట్స్‌ ప్రతినిధులు మంత్రిని కలిశారు. రాయల్టీ వసూలు ప్రైవేటు సంస్థకు అప్పగించడంతో పెద్దఎత్తున భారం పడుతోందని వారు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మంత్రి బీసీ మాట్లాడుతూ సంబంధిత శాఖ మంత్రి, ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లి నాపరాళ్ల పరిశ్రమను ఆదుకోవడానికి కృషిచేస్తానన్నారు. 2014లో, ప్రస్తుతం కూ టమి ప్రభుత్వ హయాంలోనూ నాపరాళ్ల పరిశ్రమను ఆదుకున్నది తా మేనన్నారు. రాయల్టీ విషయంపై సీఎంతో చర్చించి న్యాయం జరిగేలా చూస్తానన్నారు. కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మూలే రామేశ్వరరెడ్డి, వీఆర్‌ లక్ష్మీరెడ్డి, నంద్యాల రామేశ్వరరెడ్డి, పేట్నీకోట హుస్సేన్‌రెడ్డి, నంద్యాల ప్రసాదు, గూలి నాగేశ్వరరెడ్డి, అంబటి వివేకానందరెడ్డి, విజయ్‌, ఓబయ్య, నరసింహారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2025 | 11:40 PM