రైతులను ఆదుకుంటాం : జేసీ
ABN , Publish Date - Oct 30 , 2025 | 11:21 PM
మొంథా తుఫాన్ ప్రభావంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని జాయింట్ కలెక్టర్ కార్తీక్ అన్నారు.
ఆళ్లగడ్డ/చాగలమర్రి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ ప్రభావంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని జాయింట్ కలెక్టర్ కార్తీక్ అన్నారు. గురువారం ఆళ్లగడ్డ మండలం మిట్టపల్లె, చాగలమర్రి మండలం నేలంపాడు గ్రామంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పొలాలను పరిశీలించారు. పంట నష్టం గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. పంట నష్టం అంచనాను వ్యవసాయ సిబ్బంది యాప్ ద్వారా నమోదు చేయాలని జేసీ సూచిం చారు. అన్ని గ్రామాల్లో పంట నష్టం అంచనా వేసి రెండు రోజుల్లో నివేదికలు పంపించాలని అన్నారు. పంట నష్టం అంచనాలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన అధికారులను హెచ్చరించారు. జేసీ వెంట తహసీల్దార్లు విజయ్ కుమార్, జ్యోతి రత్నకుమారి, చాగలమర్రి ఎంపీడీవో తాహిర్‌హుసేన్, ఏవో రంగనేతాజీ, ఆళ్లగడ్డ హెచ్‌వో దస్తగిరి తదితరులు ఉన్నారు.