Share News

రైతులను ఆదుకుంటాం

ABN , Publish Date - Oct 30 , 2025 | 11:18 PM

మొంథా తుఫాన్‌ ధాటికి పంటలను నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి స్పష్టం చేశారు.

రైతులను ఆదుకుంటాం
ముదిగేడులో సమస్యలను అడిగి తెలుసుకుంటున్న మంత్రి

రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి

సంజామల, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్‌ ధాటికి పంటలను నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం మంత్రి సంజామల, కోవెలకుంట్ల మండలాల్లో మంత్రి పర్యటించి నీట మునిగిన పంటలను పరిశీలించారు. సంజామలలోని పాలేరువాగు ఉధృతి దెబ్బతిన్న పంటను పరిశీలించారు. ముదిగేడులోని ప్రాథమిక పాఠశాలలో ఆవరణంలో వర్షపు నీరు నిల్వ ఉండటాన్ని చూసి మంత్రి వెంటనే సంబంధిత అధికారులను ఆదేశించారు. నీటిని తొలగించాలని ఆదేశించారు. ప్రాథమిక పాఠశాల ఏర్పాటుకు తగిన స్థలాన్ని కేటాయించాలని తహసీల్దార్‌ అనిల్‌కుమార్‌ను ఆదేశించారు. అనంతరం మండల పరిషత్‌ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తుఫాన్‌ ధాటికి పంటలు, రోడ్లు ధ్వంసమయ్యాయన్నారు. పంట నష్టపరిహారం గణన జరుగుతోందని, రైతులందరినీ ఆదుకుంటామని మంత్రి హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి మద్దిలేటి, హౌసింగ్‌ డీఈ కృష్ణా రెడ్డి, ఏడీ సుధాకర్‌, ఎంపీడీఓ సాల్మన్‌, ఏఓ జ్యోతి, హౌసింగ్‌ ఏఈ బాలచంద్రుడు, సంజామల సహకార సంఘం అద్యక్షులు పెండేకంటి కిరణ్‌ కుమార్‌, ఎస్సార్బీసీ డిస్ట్రిబ్యూటరీ వైస్‌ చైర్మన్‌ మల్కి హుసేన్‌, టీడీపీ నాయకులు మోహన్‌ రెడ్డి, విష్ణువర్ధన్‌ రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Oct 30 , 2025 | 11:18 PM