Share News

ప్రజలకు అండగా ఉంటాం

ABN , Publish Date - Jul 18 , 2025 | 01:44 AM

ప్రజలకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జిల్లా ఇనచార్జి మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

 ప్రజలకు అండగా ఉంటాం
నాయకులతో మాట్లాడుతున్న నిమ్మల రామానాయుడు

జిల్లా ఇనచార్జి మంత్రి నిమ్మల రామానాయుడు

ఆలూరు టీడీపీ నాయకులతో మంత్రి భేటీ

కర్నూలు అర్బన, జూలై 17(ఆంధ్రజ్యోతి): ప్రజలకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జిల్లా ఇనచార్జి మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గురువారం జిల్లా టీడీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు తిక్కా రెడ్డి, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్సీ బీటీ నాయుడుల ఆధ్వ ర్యంలో ఆలూరు నియోజకవర్గంలోని నాయకులతో కలిసి మంత్రి సమీక్షించారు. మంత్రి నిమ్మల మాట్లాడుతూ ఆలూరులో సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమానికి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గం పరిశీలకుడు పూల నాగరాజు, నియోజకవర్గం పార్టీ అభ్యర్థి బి.వీరభద్రగౌడ్‌, రాష్ట్ర వాల్మీకి సంక్షేమ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన చైర్మన కపట్రాళ్ల బొజ్జమ్మ, నాయకులు వైకుంఠం జ్యోతి, వైకుంఠం శివప్రసాద్‌, అశోక్‌ కుమార్‌ యాదవ్‌, టి.టిపపయ్య, ప్రహ్లాదరెడ్డి, మీనాక్షి నాయుడు, కె.నర్సిరెడ్డి, గుమ్మనూరు సుధాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 18 , 2025 | 01:44 AM