Share News

ఉల్లి రైతులకు అండగా ఉంటాం

ABN , Publish Date - Aug 29 , 2025 | 11:40 PM

ఉల్లి రైతులకు అండగా ఉంటామని కలెక్టర్‌ రంజిత్‌ బాషా హామీ ఇచ్చారు. శుక్రవారం ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, జాయింట్‌ కలెక్టర్‌ డా.బి.నవ్యతో కలిసి కలెక్టర్‌ కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పర్యటిం చారు.

ఉల్లి రైతులకు అండగా ఉంటాం
రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ రంజిత్‌ బాషా

కలెక్టర్‌ రంజిత్‌ బాషా

కర్నూలు అగ్రికల్చర్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ఉల్లి రైతులకు అండగా ఉంటామని కలెక్టర్‌ రంజిత్‌ బాషా హామీ ఇచ్చారు. శుక్రవారం ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, జాయింట్‌ కలెక్టర్‌ డా.బి.నవ్యతో కలిసి కలెక్టర్‌ కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పర్యటిం చారు. ఉల్లి విక్రయాలపై రైతులతో మాట్లాడి అనంతరం మార్కెట్‌ కమిటీ, మార్కెటింగ్‌, ఉద్యాన శాఖ అధికారులు, వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రైతులు అమ్మకానికి తెచ్చిన ఉల్లి నాణ్యత పరిశీలించారు. కర్నూలు మార్కెట్‌ యార్డుపై ఒత్తిడి తగ్గించేందుకు కోడుమూరులో ఉల్లి విక్రయాలు జరిగేలా చర్యలు చేపట్టాలని యార్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని జేడీని ఆదేశించారు. సి.బెళగల్‌, కోడుమూరు, గూడూరు తదితర మండలాల్లోని రైతులకు దూరం తగ్గి ఖర్చులు తగ్గుతాయని కలెక్టర్‌ తెలిపారు. ఆదోని మార్కెట్‌ యార్డులో పనులు నెమ్మదిగా సాగడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కర్నూలు మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ అజ్మత్‌బీ, వైస్‌ చైర్మన్‌ శేషగిరిశెట్టి, మార్కెటింగ్‌ శాఖ జేడీ రామాంజనేయులు, ఏడీఎం నారాయణమూర్తి, ఆర్డీవో సందీప్‌ కుమార్‌, అసిస్టెంట్‌ సెక్రటరీ వెంకటేశ్వర్లు, సూపర్‌ వైజర్లు కేశవరెడ్డి, నాగేష్‌, శివన్న పాల్గొన్నారు.

Updated Date - Aug 29 , 2025 | 11:40 PM