Share News

రోగులకు వైద్యసేవలు అందిస్తాం

ABN , Publish Date - Apr 30 , 2025 | 12:18 AM

విష జ్వరాల బారిన పడిన రోగులకు వైద్య సేవలు అందిస్తామని, ఆందోళన చెందవద్దని రాష్ట్ర మలేరియ అధికారి రామనాథ్‌రావు అన్నారు. మంగళవారం మండలంలోని కలపరి గ్రామంలో పర్యటించారు. 15 రోజులగా విషజ్వరాలు ప్రబలినట్లు వార్తలు రావడంతో ఆయన రాష్ట్ర మలేరియా డిప్యూటీ డైరక్టర్‌ రామనాథ్‌రావు, ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో భాస్కర్‌, జిల్లా మలేరియ అధికారి నూకరాజుతో కలిసి గ్రామంలో పరిస్థితిని పరిశీలించారు.

 రోగులకు వైద్యసేవలు అందిస్తాం
తాగునీటి డ్రమ్మును పరిశీలిస్తున్న మలేరియా అధికారి రామనాథ్‌రావు

కలపరి గ్రామంలో పర్యటించిన రాష్ట్ర మలేరియా అధికారి

ఆస్పరి. ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): విష జ్వరాల బారిన పడిన రోగులకు వైద్య సేవలు అందిస్తామని, ఆందోళన చెందవద్దని రాష్ట్ర మలేరియ అధికారి రామనాథ్‌రావు అన్నారు. మంగళవారం మండలంలోని కలపరి గ్రామంలో పర్యటించారు. 15 రోజులగా విషజ్వరాలు ప్రబలినట్లు వార్తలు రావడంతో ఆయన రాష్ట్ర మలేరియా డిప్యూటీ డైరక్టర్‌ రామనాథ్‌రావు, ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో భాస్కర్‌, జిల్లా మలేరియ అధికారి నూకరాజుతో కలిసి గ్రామంలో పరిస్థితిని పరిశీలించారు. గ్రామంలో 53 మంది నుంచి రక్త నమునాలు సేకరించి, 26 మంది రోగులను వైద్య పరీక్షల కోసం కర్నూలుకు పంపగా పది మందికి చికున్‌ గన్యా సోకినట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. అనంతరం గ్రామానికి తాగునీరు సరఫరాచేసే ఓవర్‌హెడ్‌ ట్యాంకును తనిఖీ చేశారు. చేశారు. ఏడాది నుంచి ట్యాకుంను శుభ్రపరచలేదని గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ చికున్‌గన్యా ప్రాణంతకం కాదని, తగిన జాగ్రత్తలు పాటిస్తే తగ్గించుకోవచ్చ న్నారు. జ్వర పీడితుల ఇళ్లకు వెళ్లి తాగునీటి ట్యాంకులను పరిశీలించామ న్నారు. గ్రామంలో ఏఎన్‌ఎం లేరని అధికారుల దృష్టికి తీసుకురాగా, వెంటనే నియమించాలని రాష్ట్ర మలేరియా అధికారి ఆదేశించారు. అసిస్టెంట్‌ మలేరియా అఫీసర్‌ చంద్రశేఖర్‌, మలేరియా సబ్‌ డివిజన్‌ అధికారి రఘురాంరెడ్డి, బాలకృష్ఱా రెడ్డి, సర్పంచు భర్త పెద్దరెడ్డి, పంచాయతీ కార్యదర్శి సురేష్‌, వీఆర్వో గోవింద్‌ ఉన్నారు.

Updated Date - Apr 30 , 2025 | 12:18 AM