Share News

మెడికల్‌ కళాశాలలో మౌలిక వసతులు కల్పిస్తాం

ABN , Publish Date - Sep 05 , 2025 | 01:04 AM

నంద్యాల మెడికల్‌ కళాశాలలో విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని , బాగా చదివి ఉన్నతస్థాయికి ఎదగాలని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు.

మెడికల్‌ కళాశాలలో మౌలిక వసతులు కల్పిస్తాం
ఆర్వోప్లాంట్‌ వద్ద మెడికల్‌ కళాశాల సిబ్బందితో కలెక్టర్‌ రాజకుమారి

కలెక్టర్‌ రాజకుమారి

రూ.8.7 లక్షలతో నిర్మించిన ఆర్వో ప్లాంట్‌ ప్రారంభం

నంద్యాల హాస్పిటల్‌, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): నంద్యాల మెడికల్‌ కళాశాలలో విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని , బాగా చదివి ఉన్నతస్థాయికి ఎదగాలని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. గురువారం ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో రూ.8.70లక్షలతో నూతనంగా నిర్మించిన ఆర్వోప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థుల కోరికమేరకు రైల్వే సీఎ్‌సఆర్‌ నిధులతో ఈ ప్లాంట్‌ను నిర్మించామన్నారు. రాబోయే రోజుల్లో మెడికల్‌ కళాశాల అభివృద్ధికి మరింత కృషి చేస్తామన్నారు. కేసీకెనాల్‌ మెడికల్‌ కళాశాలలో లోపల వెళుతోందని ఆ ప్రాంతంలో గ్రీనరీ ఏర్పాటుచేసి విద్యార్థులకు ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తామన్నారు. ఇందుకుగాను రూ.40లక్షలు ఖర్చుచేస్తామన్నారు. 15రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తిచేస్తామన్నారు. అలాగే ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రూ.5.45లక్షలతో నిర్మించిన ఆర్వోప్లాంట్‌ను కలెక్టర్‌ ప్రారంభించారు. వైద్యులు రోగులకు మెరుగైన వైద్యం అందించి ఆస్పత్రికి మంచిపేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సురేఖ, జీజీహెచ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మల్లేశ్వరి, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2025 | 01:04 AM