అత్యాధునిక ఆయుధాలను సమకూరుస్తాం
ABN , Publish Date - Nov 10 , 2025 | 11:28 PM
అటవీ సంపద, వన్యప్రాణి సంరక్షణ కోసం ప్రభుత్వం నూతన నియామకాలతో పాటు, అత్యాధునిక ఆయుధాలను సమకూర్చేందుకు సిద్ధంగా ఉందని అటవీ సంరక్షణాధికారి జీవీఎ కృష్ణమూర్తి తెలిపారు.
ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలి
అటవీ సంరక్షణాధికారి జీవీఎ కృష్ణమూర్తి
కర్నూలు రాజ్‌విహార్ సర్కిల్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): అటవీ సంపద, వన్యప్రాణి సంరక్షణ కోసం ప్రభుత్వం నూతన నియామకాలతో పాటు, అత్యాధునిక ఆయుధాలను సమకూర్చేందుకు సిద్ధంగా ఉందని అటవీ సంరక్షణాధికారి జీవీఎ కృష్ణమూర్తి తెలిపారు. సోమవారం సీఎఫ్ కార్యాలయ ప్రాంగణంలో రాష్ట్ర అటవీ అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకుని స్మారక స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం దేశంలో ఏదో ఒక ప్రాంతంలో అటవీ ఉద్యోగులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని, దీనిని ప్రభుత్వం సైతం తీవ్రంగా పరిగణించి, శాఖకు మద్దతుగా చర్యలు తీసుకుంటుందన్నారు. అడవులను కాపాడటంలో అటవీ ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలన్నారు. కార్యక్రమలో జిల్లా అటవీశాఖ అధికారి శ్యామల, ఎఫ్‌ఆర్వో విజయకుమార్, రమణారెడ్డి, ఓబులేసు తదిత రులు పాల్గొన్నారు.