కార్పొరేట్ వైద్యం అందిస్తాం
ABN , Publish Date - Nov 30 , 2025 | 12:12 AM
ఏడు జిల్లాల ఆరోగ్య సంజీవిని అయిన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కార్పొరేట్ స్థాయిలో పేదలకు సేవలు అందిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసిసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు.
మంత్రి టీజీ భరత్
రూ.41 లక్షల ఖర్చుతో ఆధునిక గదులు
కర్నూలు హాస్పిటల్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి):
ఏడు జిల్లాల ఆరోగ్య సంజీవిని అయిన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కార్పొరేట్ స్థాయిలో పేదలకు సేవలు అందిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసిసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. శనివారం ఉదయం సర్వజన వైద్యశాలలో టీజీవీ ఫౌండేషన్ ద్వారా రూ.41 లక్షల సీఎ్‌సఆర్ నిధుల ద్వారా కేటాయించిన నాలుగు అత్యాధునిక సౌకర్యాలు గల పెయింగ్ బ్లాక్ రూమ్‌లను మంత్రి టీజీ భరత్, కలెక్టర్ డా.ఏ. సిరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సర్వజన వైద్యశాలలో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని, ప్రస్తుతం పెయింగ్ బ్లాక్‌లో నాలుగు గదుల సముదాయాన్ని ఆధునీకరించి ప్రారంభించామన్నారు. ఇందులో ఒక సూట్ రూమ్ అని, మిగిలినవి మూడు ఏసీ గదులన్నారు. ఇవి కార్పొరేట్ ఆసుపత్రి స్థాయిలో ఉన్నాయన్నారు. డబ్బులు చెల్లించి వినియోగించుకునే వారికి సౌకర్యంగా ఉంటాయన్నారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.కే. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పేయింగ్ బ్లాక్ విషయంలో మంత్రి అందించిన రూ.41 లక్షల సీఎ్‌సఆర్ నిధులతో అందుబాటులోకి రావడం మంచి పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.కే. చిట్టినరసమ్మ, డిప్యూటీ సూపరిటెండెంట్ డా. లక్ష్మీబాయి, సీఎ్‌సఆర్‌ఎంవో డా. పద్మజ, ఆర్‌ఎంవో డా. టీసీహెచ్ వెంకటరమణ, డీసీహెచ్‌ఎ్‌స డా. జఫ్రుల్లా, హెచ్‌డీఎ్‌స కమిటీ సభ్యులు డా. ప్రవీణ్, సాయిప్రదీప్ పాల్గొన్నారు.