Share News

ప్రతి రైతుకూ పరిహారం అందిస్తాం

ABN , Publish Date - Oct 30 , 2025 | 11:49 PM

మొంథా తుఫాను ప్రభావంతో గత మూడు రోజులుగా కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం అందిస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి పేర్కొన్నారు.

ప్రతి రైతుకూ పరిహారం అందిస్తాం
నల్లవాగులో ట్రాక్టరు నడుపుతున్న మంత్రి బీసీ జనార్దనరెడ్డి

రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి

మండలంలో సుడిగాలి పర్యటన

కోవెలకుంట్ల, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాను ప్రభావంతో గత మూడు రోజులుగా కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం అందిస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి పేర్కొన్నారు. గురువారం మంత్రి బీసీ కోవెలకుంట్ల మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. మండ లంలోని బీజనవేముల, చిన్నకొప్పెర్ల, పెద్దకొప్పెర్ల, వల్లంపాడు, గోవిందిన్నె, కోవెలకుంట్ల గ్రామాల్లో వర్షాలకు నీట మునిగిన వరి, మొక్కజొన్న, మిరప తదితర పంటలను, ఇళ్లను మంత్రి బీసీ పరిశీలించారు. అనంతరం పెద్దకొప్పర, చిన్న కొప్పెర్ల గ్రామాల మధ్యలో కైప వాగు, చిన్న కొప్పెర్ల, వల్లంపాడు గ్రామాల మధ్య ఉన్న నల్లవాగులను మంత్రి బీసీ, అధికారులను ట్రాక్టర్‌లో ఎక్కిం చుకొని ఆయన స్వయంగా నడుపుతూ వాగులను దాటారు. తమ గ్రామం చుట్టూ వరద నీరు చేరడంతో బయటికి వెళ్లేందుకు వీలు లేదని వల్లంపాడు గామానికి చెందిన టీడీపీ నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కోవెలకుంట్ల పట్టణంలోని స్వామినగర్‌ కాలనీలో మరుగు నిల్వ చేరుతుందని మంత్రి దృష్టికి తేచ్చారు. నీట మునిగి పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని జాబితా సమగ్రంగా తయారు చేసి ఇవ్వాలని జిల్లా వ్యవసాయాధికారి మద్ది లేటిని ఆదేశించారు. అనంతరం కోవెలకుంట్ల పట్టణంలో పశువైద్య శాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ బుచ్చన్న, వల్లంపాడు సర్పంచ గార్లపాటి జగదీశ్వర్‌రెడ్డి, టీడీపీ నాయకులు శంకర్‌రెడ్డి, గజ్జల హుసేనయ్య, సౌదరదిన్నె సుబ్బారెడ్డి, అమడాల మద్దిలేటి, సుబ్బరాయుడు, శంకర్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, లింగాల నాయుడు, ఏవీ సుబ్బారెడ్డి, కంపమల్ల చిన్నసుబ్బారెడ్డి, గుళ్లదుర్తి సుదర్శనరెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, గోవర్ధనరెడ్డి, రవీంద్రనాఽథరెడ్డి, శివనాగిరెడ్డి, ఏడీఏ సుధాకర్‌, పశుసంవర్థకశాఖ ఏడీ కిశోర్‌కుమార్‌, వ్యవసాయశాఖ ఏడీ సుధాకర్‌, ఏవో సుధా కర్‌రెడ్డి, తహసీల్దారు పవనకుమార్‌రెడ్డి, ఎంపీడీవో వరప్రసాద్‌, డిప్యూటీ ఎంపీడీవో ప్రకాశనాయుడు, సీఐ హనుమంత నాయక్‌, ఎస్‌ఐలు మల్లిఖార్జునరెడ్డి, భూపాలుడు, రమణయ్య పాల్గొన్నారు.

రవ్వలకొండ డంప్‌ యార్డు పరిశీలన

బనగానపల్లె: పట్టణంలోని రవ్వలకొండలోని డంప్‌యార్డును రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి గురువారం రాత్రి పరిశీలించారు. డంప్‌యార్డు నిర్వహణను సక్రమంగా నిర్వహించా లని ఈవో సతీశరెడ్డిని ఆదేశించారు. డంప్‌యార్డుకు వచ్చే వాహ నాల రాకపోకలకు సరైన రహదారి మార్గం ఉండేలా ఏర్పాటు చే యాలని మంత్రి అధికారులకు సూచించారు. పంచాయతీరాజ్‌ డీఈ నాగశ్రీనివాసులు, ఉపసర్పంచ బురానుద్దీన ఉన్నారు.

Updated Date - Oct 30 , 2025 | 11:49 PM