Share News

వరదల నుంచి పట్టణాన్ని రక్షిస్తాం

ABN , Publish Date - Nov 22 , 2025 | 11:46 PM

వరదలు, భారీ వర్షాల నుంచి బనగానపల్లె పట్టణాన్ని రక్షించేందుకు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు.

వరదల నుంచి పట్టణాన్ని రక్షిస్తాం
భూమి పూజ చేస్తున్న మంత్రి బీసీ జనార్దనరెడ్డి

‘జుర్రేరు’పై ప్రొటెక్షన బండ్‌ నిర్మాణం

ఆక్రమణలను పూర్తిగా అరికడుతాం

రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి

బనగానపల్లె, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): వరదలు, భారీ వర్షాల నుంచి బనగానపల్లె పట్టణాన్ని రక్షించేందుకు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు. శనివారం పట్టణ శివారులోని జుర్రేరు వాగు వద్ద రూ.6.9కోట్ల డీఎంఎఫ్‌ నిధులతో నిర్మిస్తున్న ప్రొటెక్షన బండ్‌ నిర్మాణ పనులను ఆయన భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు పట్టణంలోకి ప్రవేశించకుండా ఉం డేందుకు ఈప్రాజెక్ట్‌ను రూపకల్పన చేసినట్లు చెప్పారు. జుర్రేరు వాగు ఆక్రమణలను పూర్తిగా అరికట్టేందుకు సురక్షితమైన డ్రైనేజీ వ్యవస్థ స్థాపనకు ఈపనులు ఎంతో ఉపయో గపడ తాయన్నారు. ఎస్‌ఆర్‌బీసీ బ్రిడ్జి నుంచి పాతబస్టాండ్‌ వరకు 1250 మీటర్ల పొడవునా ఇరువైపుల బండ్‌ నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యతలో ఈ ప్రాంతంలో వాకింగ్‌ ట్రాక్‌ అభివృద్ధి చేసే విధంగా ప్రణాళిక రూపొంది స్తున్నట్లు వివరించారు. బండ్‌ నిర్మాణం పూర్తయితే భవిష్యతలో 52వేల క్యూసె క్కుల వరద ప్రవాహాన్ని పట్టణం నుంచి దూరంగా మళ్లించే విఽధంగా ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. జుర్రేరు వాగుకు ఇరు వైపులా అంతర్గత సిమెంట్‌ కాంక్రీట్‌ డ్రైయిన పనులను కూడా ఇప్ప టికే పూర్తిచే సినట్లు చెప్పారు. పట్టణ డ్రైనేజీ నీరు వాగులో కలవ కుండా నిరోధించేందుకు కట్టలు, డ్రైనేజీ వ్యవస్థ కీలకమన్నారు. బనగా నపల్లె పట్టణంలో పరిశుభ్రంగా ఉండేందుకు దోహదపడుతోందన్నారు. కార్యక్రమంలో మైనర్‌ ఇరిగేషన ఏఈ రామ్మోహనరెడ్డి, టీడీపీ నాయకులు ఖాశీంబాబు, అల్తాఫ్‌ హుసేన, శేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 22 , 2025 | 11:46 PM