ప్రభుత్వ ఆదాయానికి గండి కొడితే సహించం
ABN , Publish Date - Apr 26 , 2025 | 12:50 AM
అనుమతి లేకుండా వెంచర్లు వేసి ప్రభుత్వ ఆదాయానికి గండికొడితే సహించమని కుడా చైర్మన్ సోమిశెట్టి హెచ్చరించారు
కుడా చైర్మన్ సోమిశెట్టి
ఆదోనిలో అక్రమ వెంచర్ల గోడలు కూల్చివేత
ఆదోని రూరల్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): అనుమతి లేకుండా వెంచర్లు వేసి ప్రభుత్వ ఆదాయానికి గండికొడితే సహించమని కుడా చైర్మన్ సోమిశెట్టి హెచ్చరించారు. శుక్రవారం కుడా డీఈ గోపాల్ కృష్ణమూర్తి, ప్లానింగ్ అధికారి మోహన్, ఏసీపీ హయ్యత్, ఆదోని డీఎల్‌పీవో నూర్జాహాన్, పంచాయతీ కార్యదర్శులు చంద్రశేఖర్, సురేష్, విద్యుత్ అధికారులతో కలిసి మండలంలోని బైచిగేరి, నాగలాపురం, సాదాపురం, మండిగిరి, పెద్దహరివాణం, పెద్దతుంబళం గ్రామాల్లో అక్రమ లే అవుట్లలో వేసి రాళ్లు, తారు రోడ్లను ఎక్స్‌కవేటర్ సాయంతో తొలగించారు. సోమిశెట్టి మాట్లాడుతూ మండలంలో 27, ఉమ్మడి జిల్లాల్లో 300పైగా అక్రమ లే అవుట్లను గుర్తించా మని, తక్షణమే వీరంతా కుడా నుంచి అనుమతులు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. లేనిపక్షంలో వెంచర్లలో నిర్మించిన ఇళ్లను కూల్చివేస్తామని హెచ్చరించారు. ప్రజలు కొనుగోలు చేసేముందుకు ప్రజలు గమనించాలని, నాన్ లేఅవుట్లలో రోడ్లు, వీధిలైట్లు, డ్రైనేజీలు నిర్మంచబోమన్నారు. రియల్టర్లు పంచాయతీ అధికారులను బెధిరిస్తున్నారని, ఇది మంచి పద్దతి కాదన్నారు. మంత్రాలయంలో అక్రమ లే అవుట్లలో 95 లాడ్జిలు నిర్మించారని నోటీసులు ఇవ్వగా 25మంది అనుమతి తీసుకున్నారన్నారు.