Share News

ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తే ఊరుకోం

ABN , Publish Date - Aug 08 , 2025 | 11:14 PM

కేంద్ర ఎన్నికల కమిషన్‌ బీజేపీ అడుగులకు మడుగులు ఒత్తేలా ఎస్‌ఐ ఆర్‌ పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే ఊరుకోమని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయ్‌ అన్నారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తే ఊరుకోం
మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్‌దేశాయ్‌

ఈసీపై చర్యలు తీసుకోవాలి

సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్‌దేశాయ్‌

కర్నూలు న్యూసిటీ, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): కేంద్ర ఎన్నికల కమిషన్‌ బీజేపీ అడుగులకు మడుగులు ఒత్తేలా ఎస్‌ఐ ఆర్‌ పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే ఊరుకోమని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయ్‌ అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) ఓటర్‌ లిస్టులో చేస్తున్న అవకతవకవలపై సీపీఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా గౌస్‌దేశాయ్‌ మాట్లాడుతూ బిహార్లో జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా ఎన్నికల కమిషన్‌ బాగోతం బయట పడిందన్నారు. ఒక్కసారిగా 65లక్షల ఓట్లు తీసివేయడం బీజేపీ కుయుక్తులకు అనుగుణంగా పనిచేయడమే అన్నారు. బాధ్యతారాహితంగా వ్యవహరిస్తున్న ఈసీపై చర్యలు తీసుకో వాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గసభ్యులు టి.రాముడు, ఎండి.ఆనంద్‌బాబు, జి.రామ క్రిష్ణ, ఎండి.అంజిబాబు, గురుశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 08 , 2025 | 11:14 PM