Share News

నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించం: జేసీ

ABN , Publish Date - Sep 08 , 2025 | 11:40 PM

పీజీఆర్‌ఎస్‌లో గడువులోగా పరిష్కారం కాకుండా రీ ఓపెన్‌ అయిన అర్జీలపై మరింత దృష్టిసారించి పరిష్కరించాలని, ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించబోమని జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌ అన్నారు.

నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించం: జేసీ

నంద్యాల ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): పీజీఆర్‌ఎస్‌లో గడువులోగా పరిష్కారం కాకుండా రీ ఓపెన్‌ అయిన అర్జీలపై మరింత దృష్టిసారించి పరిష్కరించాలని, ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించబోమని జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌ అన్నారు. నంద్యాల కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా సోమ వారం జేసీ ప్రజల నుంచి వచ్చిన 248 అర్జీలను స్వీకరించారు. అనంత రం జేసీ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికా రులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. సమస్యలపై పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోగా పరి ష్కరించాలన్నారు. అర్జీలు పెండింగ్‌ లేకుండా, రీ ఓపెన్‌ కాకుండా జాగ్రత్త వహించాలని అధికారులకు సూచించారు. కిందిస్థాయి సిబ్బంది పై ఆధారపడకుండా స్వయంగా అధికారులే బాధితులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలన్నారు.

Updated Date - Sep 08 , 2025 | 11:40 PM