Share News

సాగు నీరందించి న్యాయం చేస్తాం

ABN , Publish Date - Mar 13 , 2025 | 12:17 AM

కోసిగి మండలంలో ప్రతి రైతుకు సాగు నీరు అందించేందుకు కృషి చేస్తానని టీడీపీ ఇనచార్జి రాఘవేంద్ర రెడ్డి అన్నారు.

సాగు నీరందించి న్యాయం చేస్తాం
కోసిగిలో పైపులైన పనులను పరిశీలిస్తున్న రాఘవేంద్ర రెడ్డి

మంత్రాలయం టీడీపీ ఇనచార్జి రాఘవేంద్రరెడ్డి

పైపులైన పనుల పరిశీలన

కోసిగి, మార్చి 12(ఆంధ్రజ్యోతి): కోసిగి మండలంలో ప్రతి రైతుకు సాగు నీరు అందించేందుకు కృషి చేస్తానని టీడీపీ ఇనచార్జి రాఘవేంద్ర రెడ్డి అన్నారు. బుధ వారం కోసిగిలోని ఆదోని రోడ్డు వైపున ఉన్న కోసిగి రైతుల పంట పొలాలను ఆయన పరిశీలించారు. కోసిగిలోని పులి కనుమ ప్రాజెక్టు ద్వారా సుమారు 2వేల ఎకరాలకు 5 కిలోమీటర్ల మేర రూ.7 కోట్లతో పైపులైన పనులు జరుగుతున్నాయని, రైతులతో కలిసి పనులు పరిశీలించామన్నారు. కోసిగి మండల రైతులకు సాగునీరు అందిస్తే వల సలు వెళ్లకుండా ఇక్కడే వ్యవసాయ పనులు చేసుకుంటూ పలువురికి ఉపాధి కల్పి స్తారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పల్లెపాడు రామిరెడ్డి, వక్రాణి వెంక టేశ, నాడిగేని అయ్యన్న, జ్ఞానేష్‌, జక్కనగేని వెంకటేశ, చింతలగేని నర్సారెడ్డి, ఈరన్న, సాతనూరు కోసిగయ్య, సొట్టయ్య, బీజేపీ రాముడు, హోళగుంద కోసిగయ్య, అర్జున, రంగారెడ్డి, గోపాల్‌, మల్లికార్జున, రైతులు పాల్గొన్నారు.

మహిళల ఆర్థికాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం

మంత్రాలయం: మహిళల ఆర్థికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి రాఘవేంద్రరెడ్డి అన్నారు. బుధవారం మాధవరం తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో నాయకులు రమాకాంతరెడ్డి, ఉలిగ య్య, పల్లిపాడురామిరెడ్డితో కలిసి మాట్లాడారు. మహిళల సంక్షేమానికి 2025- 26 బడ్జెట్‌లో రూ.432 కోట్లు కేటాయించిందని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిం చి జీవన నైపుణ్యం పొంది ఆర్థిక శక్తిగా మారాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యమ న్నారు. తల్లి, చెల్లిని గెంటేసిన జగనరెడ్డికి మహిళలను అక్కా, చెల్లెలు అనే అర్హత లే దన్నారు. ఈసమావేశంలో టీడీపీ నాయకులు రామకృష్ణారెడ్డి, రఘునాథరెడ్డి, రామ కృష్ణ, టిప్పుసుల్తాన, అడివప్పగౌడు, నర్సరెడ్డి, వెంకటపతిరాజు, జ్ఞానేష్‌, ఈరన్న, రాజానంద్‌, విజయ్‌, పెద్దన్న, మల్లికార్జున, అంజనేయులు, బొజ్జప్ప, చాకలి రాఘ వేంద్ర, విజయ్‌కుమార్‌, నరసింహులు పాల్గొన్నారు.

Updated Date - Mar 13 , 2025 | 12:17 AM