విచారణ జరిపి న్యాయం చేస్తాం
ABN , Publish Date - Dec 22 , 2025 | 11:05 PM
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకి వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 84 పిర్యాదులు
ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు క్రైం, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకి వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం కొత్తపేటలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్ సమీపంలో ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్ర మాన్ని నిర్వహించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్ర మానికి మొత్తం 84 ఫిర్యాదులు వచ్చాయి. సీఐలు శివశంకర్, రమేష్, విజయలక్ష్మి ఉన్నారు.