విచారణ జరిపి న్యాయం చేస్తాం
ABN , Publish Date - Dec 22 , 2025 | 10:43 PM
జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చే ప్రతి ఫిర్యాదును చట్ట పరిధిలో విచారణచేసి న్యాయం చేస్తామని ఎస్పీ సునీల్ షెరాన్ పేర్కొన్నారు.
ఎస్పీ సునీల్ షెరాన్
పీజీఆర్‌ఎ్‌సకు 94 ఫిర్యాదులు
నంద్యాల టౌన్, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చే ప్రతి ఫిర్యాదును చట్ట పరిధిలో విచారణచేసి న్యాయం చేస్తామని ఎస్పీ సునీల్ షెరాన్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫిర్యాదుదారుల నుంచి ఎస్పీ నేరుగా ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలు విన్నారు. ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా కార్యాలయానికి 94 ఫిర్యాదులొచ్చాయని, విచారణ చేసి వెంటనే న్యాయం చేయాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. మండలం, డివిజన్ స్థాయిలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాటిపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కువగా సివిల్, కుటుంబ కలహా లు, తగదాలు ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. నంద్యాలలోని సాయిబాబానగర్‌కు చెందిన వెంకటేశ్వర్లు, అశోక్ , రమణయ్య తన వద్దనుంచి రూ.3.5 లక్షలు నగదు తీసుకుని స్థలం రిజిస్ట్రేషన్ చేయిస్తానని చెప్పి చేయకుండా తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని సాయిబాబానగర్‌కు చెందిన లక్ష్మిదేవి ఫిర్యాదు చేశారు. పోన్నాపురానికి చెందిన రూపేంద్ర, నీరజాక్షి నుంచి గతంలో స్థలం కొనుగోలు చేశానని, ప్రస్తుతం స్థలం శుభ్రం చేయడానికి వెళ్తే ఆదనంగా డబ్బు లు చెల్లించాలని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని సత్యవతి ఎస్పీకి ఫి ర్యాదు చేశారు. బనగానపల్లె మండలం పలుకూరులో తన పూర్వీకులకు చెందిన స్థలాన్ని అక్రమంగా మాదని మహేశ్, నాగిరెడ్డి అనే వ్యక్తులు దౌర్జన్యం చేస్తు, బెదిరింపులకు పాల్పడుతున్నారని బేతంచెర్ల మండలం గోరుగట్ల గ్రామానికి చెందిన ఆంజనేయులు ఫిర్యాదు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.