విచారణ జరిపి న్యాయం చేస్తాం
ABN , Publish Date - Sep 15 , 2025 | 11:37 PM
ప్రతి అర్జీని విచారణ జరిపి న్యాయం చేయాలని ఎస్పీ సునీల్ షెరాన్ అధికారులకు సూచించారు.
ఎస్పీ సునీల్ షెరాన్
పోలీసు కార్యాలయానికి 105 ఫిర్యాదులు
నంద్యాల టౌన్, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): ప్రతి అర్జీని విచారణ జరిపి న్యాయం చేయాలని ఎస్పీ సునీల్ షెరాన్ అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈకార్యక్రమానికి 105 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐలు ఇస్మాయిల్, మోహన్‌రెడ్డి, జయరాములు పాల్గొన్నారు.
ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదు
మాది వి.రామాపురం గ్రామం. గతంలో ప్రభుత్వం మాకు 1.45సెంట్ల భూమిని ఇచ్చారు. మాపొలం పక్కనే ఉన్న వ్యక్తి దానమయ్యకు గుత్తకు ఇచ్చాం. ప్రస్తుతం పొలం తనది అని, నేను ఎవరికి ఇవ్వను అంటున్నాడు. ఆత్మకూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేస్తే పట్టించుకోవడం లేదు.
సరోజమ్మ, వి.రామాపురం, ఆత్మకూరు మండలం