Share News

ఆలూరు బ్రాంచ్‌ కెనాల్‌కు నీరందిస్తాం

ABN , Publish Date - Aug 01 , 2025 | 12:41 AM

హంద్రీనీవా ద్వారా ఆలూరు బ్రాంచ్‌ కెనాల్‌కు నీరందిస్తామని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, టీడీపీ ఇన్‌చార్జి వీరభద్రగౌడ్‌ తెలిపారు

ఆలూరు బ్రాంచ్‌ కెనాల్‌కు నీరందిస్తాం
నీటిని విడుదల చేస్తున్న ఎమ్మెల్యే

ఆలూరు(చిప్పగిరి), జూలై 31 (ఆంధ్ర జ్యోతి): హంద్రీనీవా ద్వారా ఆలూరు బ్రాంచ్‌ కెనాల్‌కు నీరందిస్తామని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, టీడీపీ ఇన్‌చార్జి వీరభద్రగౌడ్‌ తెలిపారు. గురువారం గుంతకల్లు సమీపంలో తూము నుంచి నీటినిక ఏబీసీ డీసీ అద్యక్షుడు నగరడోణ కిష్టప్ప విడుదల చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ హంద్రీనీవా ద్వారా చిప్పగిరి, ఆలూరు, హాలహర్వి మండలా లకు సాగునీరు అందు తుందన్నారు. వీరభద్రగౌడ్‌ మాట్లాడుతూ ఆలూరు ప్రాంతానికి నీటిని విడుదల చేయడం పట్ల సీఎం చంద్రబాబు, మంత్రి నిమ్మల రామా నాయుడు, ఎమ్మెల్యే జయరాంకు కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు నారాయణ స్వామి, గుమ్మనూరు నారాయణ, ఎంపీటీసీ రజినీ, తిమ్మయ్య, అట్టేకల్‌ బాబు, ఈఈ శ్రీనివాసనాయక్‌, డీఈ చంద్ర ఉన్నారు.

Updated Date - Aug 01 , 2025 | 12:41 AM