హామీలన్నీ నెరవేర్చుతాం
ABN , Publish Date - Nov 12 , 2025 | 12:30 AM
డోన టౌన, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లాలో ఉన్న డోనను కర్నూలు జిల్లాలో కలుపుతామని గత ఎన్నికల ముందు ప్రజ లకు ఇచ్చిన హామీని నెరవేర్చుతామని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్ర కాశ రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి
డోన టౌన, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లాలో ఉన్న డోనను కర్నూలు జిల్లాలో కలుపుతామని గత ఎన్నికల ముందు ప్రజ లకు ఇచ్చిన హామీని నెరవేర్చుతామని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్ర కాశ రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని టీడీపీ కార్యాల యం లో ఇటీవల నూతనంగా ఎంపికైన డోన, ప్యాపిలి, బేతంచెర్ల మండ లాల కన్వీనర్లు, క్లస్టర్ ఇనచార్జిలు, బూత కన్వీనర్లకు ప్రమాణ స్వీకారాన్ని డోన నియోజకవర్గ అబ్జర్వర్ కేసీ హరి చేయించారు. డోన పట్టణ అధ్యక్షుడిగా టీఈ రాఘవేంద్రగౌడు, మండల అధ్యక్షుడిగా దశరథరామిరెడ్డి, బేతంచెర్ల పట్టణ అధ్యక్షురాలుగా బుగ్గన ప్రసన్న లక్ష్మి, బేతంచెర్ల పట్టణ అధ్యక్షుడిగా ఎల్లనాగయ్య, ప్యాపిలి మండల అధ్యక్షుడిగా మెట్టుపల్లె సుదర్శన, ప్యాపిలి పట్టణ అధ్యక్షుడిగా కొంగనపల్లి మధుతోపాటు డోన మండల జనరల్ సెక్రటరీగా జయ న్న యాదవ్, పట్టణ జనరల్ సెక్రటరీగా షేక్ మహ్మద్ రఫీ, బేతం చెర్ల పట్టణ జనరల్ సెక్రటరీగా ఫయాజ్ హుశేన, మండల సెక్రట రీగా రాజ గోపాల్ రెడ్డిలు, డోన మండల ఆర్గనైజింగ్ సెక్రటరీగా గోసానిపల్లె శ్రీరా ములు, నడిగడ్డి నాగేంద్ర, జి.పుల్లయ్యలతో ప్రమాణ స్వీకారం చేయిం చారు. అంతకు ముందుగా దివంగత ఎన్టీ రామా రావు చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం టీడీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఢిల్లీలో జరిగిన బాంబు పేళ్లులో మృతి చెందిన వారికి రెండు నిమిషాలు పాటించి సంతాపం తెలియజేశారు. ఎమ్మెల్యే కోట్ల మాట్లాడుతూ టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని, కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని అన్నారు.
ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు: పట్టణ ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోట్ల అధికారులకు సూచించారు. పట్టణంలోని పాతపేట పూలమార్కెట్, బేతంచెర్ల సర్కి ల్, దొరపల్లె బ్రిడ్జి, మాలిక్‌బాబా ప్రాంతాలో ట్రాఫిక్ సమస్యలు, రైల్వే గేట్ల వద్ద రద్దీ, రహదారి మరమ్మతులు, మౌలిక సదుపాయాలపై ఎమ్మెల్యే పరిశీలించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన వై.నాగే శ్వరరావు యాదవ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కోట్రికే హరికిషన, వలసల రామకృష్ణ, లక్కసాగరం లక్ష్మిరెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన టీఈ కేశన్నగౌడు, మాజీ సర్పంచ పెద్ద కేశవయ్య గౌడు, సింగిల్ విండో సొసైటీ చైర్మన చిన్నపూజర్ల ఎల్లగౌడు, మాజీ ఎంపీపీ శేషఫణిగౌడు, నాయకులు చండ్రపల్లె లక్ష్మీనారాయణ యాదవ్, సుఽ దాకర్, ప్రభాకర్ రెడ్డి ఓంప్రకాష్, వెంకట నారాయణగౌడు, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడు, వైస్ చైర్మన కోట్రికే హరికిషణ్ పాల్గొన్నారు.