ప్రజల భద్రతకు భరోసా కల్పిస్తాం
ABN , Publish Date - Oct 26 , 2025 | 11:29 PM
శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ, ప్రజల భద్రతకు భరోసాను కల్పిస్తామని ఎస్సీ సునీల్ షెరాన్ అన్నారు.
నేర రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం
ఎస్పీ సునీల్ షెరాన్
నంద్యాల టౌన్, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ, ప్రజల భద్రతకు భరోసాను కల్పిస్తామని ఎస్సీ సునీల్ షెరాన్ అన్నారు. ఆదివారం తెల్లవా రుజామున నంద్యాలలో ఆరు స్టేషన్ల పరిధిలో కార్డన్ సెర్చ్ నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నంద్యాల జిల్లాను నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. అనుమానిత ప్రాంతాలు, వ్యక్తుల ఇళ్లలో సోదాలు నిర్వహించామన్నారు. సరియైున పత్రాలు లేని 24 బైకులు, 111 క్వార్టర్ బాటిళ్లు, 8 బీర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నంద్యాల తాలుకా, అవుకు, గోస్పాడు, జూపాడుబంగ్లా, రాచర్ల, పాములపాడు పోలీసుస్టేషన్ల పరిధిలో కార్డన్ సర్చ్ చేపట్టామన్నారు. ఎవరైనా నేరాలకు పాల్పడినట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమా చారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో తాలుకా సీఐ ఈశ్వరయ్య, పలు స్టేషన్ల అధికారులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.