Share News

న్యాయం చేస్తాం

ABN , Publish Date - Dec 29 , 2025 | 11:50 PM

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించి న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు.

 న్యాయం చేస్తాం
ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఎస్పీ

పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 101 ఫిర్యాదులు

ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

కర్నూలు క్రైం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించి న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు. సోమవారం స్థానిక కొత్తపేటలోని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలో ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి 101 ఫిర్యాదులు వచ్చాయి.

తన కొడుకులు తనను చూసుకోవడం లేదని కల్లూరుకు చెందిన బి. అయ్యప్ప ఫిర్యాదు చేశారు.

లోన్‌ అమౌంటు ఇప్పిస్తామని చెప్పి మోసం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కర్నూలు కృష్ణానగర్‌కు చెందిన వినయ్‌బాబు ఫిర్యాదు చేశారు.

హైదరాబాదు క్లారీ ఫాక్స్‌ టెక్నాలజీలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మోసం చేశాడని కర్నూలు లక్ష్మీ టౌన్‌షిప్‌కు చెందిన చరణ్‌ రాజ్‌ ఫిర్యాదు చేశారు.

తాకట్టు పెట్టిన బంగారం ఇప్పించాలని ఎమ్మిగనూరు చెందిన అబ్దుల్‌ ఫిర్యాదు చేశారు. అడిషనల్‌ ఎస్పీ హుస్సేన్‌పీరా, సీఐలు శివశంకర్‌, శ్రీనివాస నాయక్‌, రామయ్య నాయుడు పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2025 | 11:50 PM