బనగానపల్లెను మోడల్ సిటీగా తీర్చిదిద్దుతా
ABN , Publish Date - Dec 04 , 2025 | 12:30 AM
బనగానపల్లె పట్టణాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు.
బనగానపల్లె, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): బనగానపల్లె పట్టణాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచే పట్టణంలో సుమారు రూ.60కోట్లకు పైగా వ్యయంతో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన తనిఖీ చేశారు. మధ్యాహ్నం వరకు పట్టణంలో మంత్రి సుడిగాలి పర్యటనలు చేపట్టారు. పెట్రోల్‌బంకు వద్ద సర్కిల్ ఏర్పాటు, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో మంత్రి ఆర్‌అం డ్‌బీ అధికారులకు సూచించారు. నిర్దిష్ట వ్యవధిలో బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పట్టణంలోని ఎస్సీ హాస్టల్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించి ఎస్సీ హాస్టల్‌లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరాతీశారు. తెల్లవారుజాము నుం చే ఈపర్యటనలు చేపట్టడంతో అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. కార్యక్ర మంలో ఎంపీడీవో నాగరాజు, డిప్యూటీ ఎంపీడీవో బాలాంజనేయులు, పంచాయితీ రాజ్ డీఈ నాగశ్రీనివాసులు, ఆర్‌ఆండ్‌బీ ఈఈ శ్రీధర్‌రెడ్డి, ఏఈ హుసేన, టీడీపీ నాయకులు అత్తార్ కలాం, సలాం, ఇస్మాయిల్‌ఖాన, అల్తాప్‌హుసేన, పీ.ఏ విష్ణువర్దనరెడ్డి, ఎస్‌ఐ దుగ్గిరెడ్డి అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.