అవినీతి, అలసత్వాన్ని అరికడతాం
ABN , Publish Date - Aug 16 , 2025 | 12:18 AM
ప్రభుత్వ ఉద్యోగుల్లో అవినీతిని, అలసత్వాన్ని, అధికార దుర్వినియోగాన్ని అరికట్టడానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర ఉప లోకాయుక్త రజిని అన్నారు.
రాష్ట్ర ఉప లోకాయుక్త రజిని
కర్నూలు లీగల్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ఉద్యోగుల్లో అవినీతిని, అలసత్వాన్ని, అధికార దుర్వినియోగాన్ని అరికట్టడానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర ఉప లోకాయుక్త రజిని అన్నారు. శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా లోకాయుక్త కార్యాలయంలో జాతీయ జెండాను ఆమె ఎగురవేశారు. ఈ సందర్భంగా రజిని మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి లోకాయుక్త కృషి చేస్తుందన్నారు. ప్రజలు తమ హక్కులను కాపాడుకోవడానికి లోకాయుక్తను ఆశ్రయిస్తే విచారించి న్యాయం అందిస్తుందన్నారు.