Share News

ఉల్లిని కొనుగోలు చేస్తాం: జేసీ

ABN , Publish Date - Sep 13 , 2025 | 12:49 AM

రైతులు అమ్మకానికి తెచ్చిన ఉల్లిని మొత్తం కొనుగోలు చేయించే బాధ్యత ప్రభు త్వం తీసుకుంటోందని జాయింట్‌ కలెక్టర్‌ బి.నవ్య అన్నారు.

ఉల్లిని కొనుగోలు చేస్తాం: జేసీ
రైతులతో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ నవ్య

కర్నూలు అగ్రికల్చర్‌, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): రైతులు అమ్మకానికి తెచ్చిన ఉల్లిని మొత్తం కొనుగోలు చేయించే బాధ్యత ప్రభు త్వం తీసుకుంటోందని జాయింట్‌ కలెక్టర్‌ బి.నవ్య అన్నారు. శుక్రవారం జాయింట్‌ కలెక్టర్‌ డా.నవ్యతోపాటు మార్కెటింగ్‌ శాఖ జేడీ రామాంజ నేయులు, డీడీ ఉపేంద్ర, ఏడీఎంలు సత్యనారాయణ చౌదరి, నారా యణమూర్తి, కర్నూలు మార్కెట్‌ కమిటీ సెలక్షన గ్రేడ్‌ సెక్రటరీ జయ లక్ష్మితో కలిసి మార్కెట్‌ యార్డును పరిశీలించారు. ఈసందర్భంగా రైతు లతో జేసీ మాట్లాడుతూ రైతులు తెచ్చిన ఉల్లిలో 6,749 క్వింటాళ్లు వ్యాపారులతో కొనుగోలు చేయించామని, మిగిలిన 5,576 క్వింటాళ్ల ఉల్లిని మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేశామని చెప్పారు. ప్రతి రైతుకు క్వింటానికి రూ.1,200 ధర అందిస్తున్నామన్నారు. జేసీ వెంట కర్నూలు మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన శేషగిరిశెట్టి, అసిస్టెట్‌ సెక్రటరీ వెంకటే శ్వర్లు, కోడుమూరు సెక్రెటరీ సుందర్‌రాజు, సూపర్‌వైజర్లు ఉన్నారు.

Updated Date - Sep 13 , 2025 | 12:50 AM