Share News

బాధితులకు న్యాయం చేస్తాం: ఎస్పీ

ABN , Publish Date - Dec 08 , 2025 | 11:50 PM

: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి సమస్యలు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చే స్తామని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు.

బాధితులకు న్యాయం చేస్తాం: ఎస్పీ
ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

కర్నూలు క్రైం, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి సమస్యలు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చే స్తామని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు. సోమవారం నగరంలోని కొత్తపేటలోని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలో ఎస్పీ క్యాంపు కార్యాల యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేధిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 119 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ హుస్సేన్‌ పీరా, సీఐలు శ్రీనివాస నాయక్‌, ఇబ్రహీం, శ్రీధర్‌ ఉన్నారు.

వచ్చిన ఫిర్యాదులు

సర్వశిక్ష అభియాన్‌లో ప్రభుత్వ పథకం కింద ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం ఇస్తామని చెప్పి రూ.1లక్ష తీసుకుని గూడూరుకు చెందిన సుధాకర్‌ ఫేక్‌ ఆర్డర్‌ కాఫీ ఇచ్చి రెండు నెలలు పని చేయించుకుని మోసం చేసినట్లు కర్నూలు శ్రీరామ్‌నగర్‌కు చెందిన అన్నమ్మ ఫిర్యాదు చేశారు. తనకు ఇద్దరు కుమారులు ఉన్నారని, ఇంటి నుంచి గెంటేశారని గూడూరు చెందిన అంజినమ్మ ఫిర్యాదు చేశారు. కర్నూలు ఆర్మీ ఎన్‌సీసీ క్యాంటీన్‌లో జూనియర్‌ అసిస్టెట్‌ ఉద్యోగం ఇప్పిస్తానని కర్నూలుకు చెందిన కాశీం వలి రూ.5 లక్షలు తీసుకుని మోసం చేశాడని కర్నూలు బాలాజీ నగర్‌కు చెందిన భారతి ఫిర్యాదు చేశారు. కర్నూలు వెంకాయపల్లె వద్ద ఉన్న 1.40 ఎకరాల మా భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కర్నూలు మిలిటరీ కాలనీకి చెందిన చంద్రమ్మ ఫిర్యాదు చేశారు. హైదరాబాదులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం పేరిట కర్నూలుకు చెందిన బోజుగు కిశోర్‌ రూ.11.10లక్షలు తీసుకుని ఫేక్‌ లెటర్‌ ఇప్పించి మోసం చేశాడని హైదరాబాదుకు చెందిన దీప ఫిర్యాదు చేశారు. పవన్‌ రెసిడెన్సీ ఓనర్స్‌ వాట్సప్‌ గ్రూపులో తనను అవమానిస్తూ మాట్లాడిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కర్నూలుకు చెందిన జ్ఞానేశ్వరగుప్తా ఫిర్యాదు చేశారు.

Updated Date - Dec 08 , 2025 | 11:50 PM