Share News

బాధితులకు న్యాయం చేస్తాం: ఎస్పీ

ABN , Publish Date - Jul 01 , 2025 | 12:39 AM

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేధిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి సమస్యలు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు.

బాధితులకు న్యాయం చేస్తాం: ఎస్పీ
ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

కర్నూలు క్రైం, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి) : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేధిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి సమస్యలు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు. సోమవారం స్థానిక కొత్తపేటలోని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలో ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 135 పిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో మహిళా పీఎస్‌ డీఎస్పీ శ్రీనివాసాచారి, సీఐలు పాల్గొన్నారు.

ఫిర్యాదుల్లో కొన్ని..: తాను లండన్‌లో హోటల్‌ మేనేజర్‌గా పని చేస్తున్నానని, సోషల్‌ మీడియాలో పరిచయమైన కడప జిల్లాకు చెందిన ఒక మహిళ ప్రేమ పేరు చెప్పి రూ.35 లక్షలు తీసుకొని మోసం చేసిందని కొత్తపేటకు చెందదిన మునీర్‌ అహ్మద్‌ ఖురేషీ ఫిర్యాదు చేశారు. తన నెంబర్‌ బ్లాక్‌లో ఉంచిందని చెప్పారు. కర్నూలుకు చెందిన ఇద్దరు వ్యక్తులు సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో జూనియర్‌ అసిస్టెంట్‌, వార్డెన్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.6 లక్షలు తీసుకుని మోసం చేశారనీ మంత్రాలయం మండలం రచ్చుమర్రి గ్రామానికి చెందిన రాజు, మునిస్వామి పిర్యాదు చేశారు. పూణెలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం ఇప్పిస్తామి సంవత్సరానికి రూ.5 లక్షలు ప్యాకేజీ అని కడప చెందిన అశోక్‌ కుమార్‌ రూ.1.50 లక్షలు తీసుకుని నకిలీ అపాయింట్‌మెంటు లెటర్‌ ఇచ్చి బోర్డు మీటింగ్‌, ప్రాజెక్టు వర్క్‌ చేయించి ట్రైనింగ్‌ ఇప్పించి మోసం చేశారని కర్నూలు మాధవీనగర్‌కు చెందిన చంద్రకళ ఫిర్యాదు చేశారు. జిషింత్‌ రాణి, శ్రేయాస్‌లు కలిసి మా ఇద్దరి పిల్లలకు బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.4.30 లక్షలు తీసుకుని బోగస కంపెనీలో ఉద్యోగం ఇప్పించి మోసం చేశారని కర్నూలు ఉద్యోగ నగర్‌కు చెందిన ఆర్‌.ప్రకాష్‌ రాజ్‌ ఫిర్యాదు చేశారు.

Updated Date - Jul 01 , 2025 | 12:39 AM