Share News

బాధితులకు న్యాయం చేస్తాం

ABN , Publish Date - Aug 04 , 2025 | 11:59 PM

ప్రజా ఫిర్యాదుల పరి ష్కార వేదికకి వచ్చిన ఫిర్యాదులన్నింటిని విచారణ జరిపి బాఽధితులకు న్యాయం చేస్తామని అడిషనల్‌ ఎస్పీ హుస్సేన్‌ పీరా పేర్కొన్నారు.

బాధితులకు న్యాయం చేస్తాం
ఫిర్యాదులు స్వీకరిస్తున్న అడిషినల్‌ ఎస్పీ హుస్సేన్‌పీరా

అడిషినల్‌ ఎస్పీ హుస్సేన్‌ పీరా

పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 104 ఫిర్యాదులు

కర్నూలు క్రైం, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరి ష్కార వేదికకి వచ్చిన ఫిర్యాదులన్నింటిని విచారణ జరిపి బాఽధితులకు న్యాయం చేస్తామని అడిషనల్‌ ఎస్పీ హుస్సేన్‌ పీరా పేర్కొన్నారు. సోమవారం కొత్తపేటలోని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలో ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్ర మాన్ని నిర్వహించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 104 ఫిర్యాదులు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐలు పాల్గొన్నారు.

ఫిర్యాదుల్లో కొన్ని:

జిల్లా కోర్టులో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కర్నూలుకు చెందిన హరిప్రసాద్‌, మురళీధర్‌రెడ్డి రూ.4లక్షలు తీసుకుని మోసం చేశారని, డబ్బులివ్వకుండా ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని సత్యసాయి జిల్లా, ఎన్పీకుంట గ్రామానికి చెందిన ఎస్‌.అమీర్‌బాషా ఫిర్యాదు చేశారు.

శ్రీనివాసాచారి అనే వ్యక్తి ఫైనాన్స్‌ కార్లను డబ్బుల కోసం తాకట్టు పెట్టి మోసాలకు గురి చేస్తున్నాడు. తర్వాత ఫైనాన్స్‌ వారు వచ్చి కార్లను తీసుకెళుతున్నారు. ఈ విధంగా నమ్మించి తనతో పాటు వెంకటేశ్వరరెడ్డి, వీరేష్‌, అససుద్దీన్‌ల నుంచి కలిపి మొత్తం రూ.10లక్షలు తీసుకుని మోసం చేశాడనీ చర్యలు తీసుకోవాలని ఆస్పరి మండలం, బిన్నిగేరి గ్రామానికి చెందిన ఈరన్న ఫిర్యాదు చేశారు.

Updated Date - Aug 04 , 2025 | 11:59 PM