నేరాలను అదుపులోకి తీసుకువస్తాం : ఎస్పీ
ABN , Publish Date - Sep 25 , 2025 | 11:18 PM
ప్రజల సహకారంతో నేరాలను అదుపులోకి తీసుకు వస్తామని ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు.
శ్రీశైలం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ప్రజల సహకారంతో నేరాలను అదుపులోకి తీసుకు వస్తామని ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు. గురువారం సు న్నిపెంట, శ్రీశైలం పోలీస్‌స్టేషన్లను ఆయన తనిఖీ చేశారు. ముందుగా ఆయన భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. క్షేత్రంలోని కమాండ్ కంట్రోల్ రూం, క్యూలైన్లు, వీఐపీ అతిథి గృహం, రింగ్ రోడ్డు తదితర ప్రాంతాలను పరిశీలించారు. శ్రీశైలంలోని రెండు పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అదేవిధంగా శ్రీశైలం రిజర్వాయర్‌ను సందర్శించారు. సున్నిపెంట పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సిబ్బంది కొరతను దృష్టిలో ఉంచుకుని రొటేషన్ పద్ధతిలో విధులు నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు. సున్నిపెంటలో నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. శ్రీశైలం మహాక్షేత్రంలో భద్రతలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ఎస్పీ వెంట ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్, సీఐలు ప్రసాదరావు, చంద్రబాబు, ఎస్‌ఐలు ఉన్నారు.