స్మార్ట్ మీటర్లను ధ్వంసం చేస్తాం
ABN , Publish Date - Jul 06 , 2025 | 12:59 AM
: విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించాలని చూస్తే వాటిని ధ్వంసం చేస్తామని సీపీఐ కార్యదర్శివర్గ సభ్యుడు రామచంద్రయ్య హెచ్చరించారు

సీపీఐ కార్యదర్శివర్గ సభ్యుడు రామచంద్రయ్య
పత్తికొండటౌన్, జూలై 5 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించాలని చూస్తే వాటిని ధ్వంసం చేస్తామని సీపీఐ కార్యదర్శివర్గ సభ్యుడు రామచంద్రయ్య హెచ్చరించారు. శనివారం స్థానిక సీఆర్ భవన్ నుంచి ర్యాలీ నిర్వహించి నాలుగు స్తంభాలకూడలికి చేరుకున్నారు. వైసీపీ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తే పగులగొట్టాలని చెప్పిన చంద్రబాబు, లోకేశ్ అధికారంలోకి వచ్చాక చేస్తున్నది ఏంటని ప్రశ్నించారు. విద్యుత్ చార్జీలను పెంచబోమని చెప్పి అధికారంలోకి రాగానే చార్జీలను పెంచడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. గత ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు పగలగొట్టిన సీపీఐ నాయకులపై కేసులు నమోదయ్యారని కోర్టు వాయిదాలకు తిరుగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. రాజాసాహెబ్, రామాంజనేయులు, సురేంద్రకుమార్, గురుదాస్, కారుమంచి, వీరన్న, తిమ్మయ్య, రంగన్న, సిద్ధు, చాకలి వీరేష్ తదితరులు పాల్గొన్నారు.
స్మార్ట్ మీటర్లను వెనక్కి తీసుకొవాలి
దేవనకొండ: విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ప్రభుత్వం వెనక్కి తీసుకొవాలని సీపీఐ నాయకులు మద్దిలేటిశెట్టి, నర్సారావ్ డిమాండ్ చేశారు. శనివారం దేవనకొండ టర్నింగ్ వద్ద కర్నూలు-బళ్లారి రహదా రిపై రాస్తారోకో నిర్వహించారు. అధికారంలోకి రాకముందు కరెంట్ బిల్లులపై ఆందోళన చేసిన టీడీపీ నాయకులు ప్రభుత్వం రాగానే సర్దుబాటు పేరుతో పేదల నడ్డి విరిచిందని, ఇప్పుడు స్మార్ట్‌మీటర్లు ఏర్పాటు చేయడం ఏంటని విరమించుకొవాలని కోరారు. కండప్ప, కృష్ణ, రవి, రామాంజీనేయులు, బాస్కర్, తదితరులు పాల్గొన్నారు