ప్రజాభిప్రాయ సేకరణలో మెరుగైన శాతాన్ని సాధిస్తాం : కలెక్టర్
ABN , Publish Date - Oct 09 , 2025 | 11:11 PM
ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలకు సంబంధించి ప్రజాబిప్రాయ సేకరణలో నంద్యాల జిల్లాలో మెరుగైన ఫలితాలు సాధిస్తామని కలెక్టర్ రాజకుమారి తెలిపారు.
నంద్యాల నూనెపల్లి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలకు సంబంధించి ప్రజాబిప్రాయ సేకరణలో నంద్యాల జిల్లాలో మెరుగైన ఫలితాలు సాధిస్తామని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ రాష్ట్ర సచివాలయం నుంచి కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లాలో సాధించిన ప్రగతిపై కలెక్టర్ రాజకుమారి వివరించారు. రెవెన్యూ అంశాలపై జిల్లా పరిపాలన ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. ఇప్పటి వరకు 25వేల జాయింట్ ఎల్‌పీఎంలు పరిష్కరించామన్నారు. ఈకార్యక్రమంలో జేసీ విష్ణుచరణ్, డీఆర్వో రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు.