చెత్త రహిత జిల్లా కోసం పని చేయాలి
ABN , Publish Date - Jun 27 , 2025 | 11:51 PM
నంద్యాల జిల్లాను చెత్తరహిత జిల్లాగా మార్చడానికి బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు.
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల నూనెపల్లె, జూన్ 27 (ఆంధ్రజ్యోతి) : నంద్యాల జిల్లాను చెత్తరహిత జిల్లాగా మార్చడానికి బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సెంటినరి హాల్‌లో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్- 2025పై ఎంపీడీవోలు, ఈవీపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులకు ఒకరోజు జిల్లా స్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అకడమిక్ మేనేజ్‌మెంట్ స్టడీస్ ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న గ్రామాలను, అక్కడ నిర్వహిస్తున్న పారిశుధ్య పనులను పరిశీలించి పరిశుభ్రంగా ఉన్న గ్రామాలకు ర్యాంకులు కేటాయిస్తారని అన్నారు. అందుకు ఐఐఎంఎస్ డేటా నుంచి వారు ఎంపికచేసుకున్న గ్రామాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ అంశాలపై నిర్వహిస్తున్న కార్యకలాపాలను పూర్తిస్థాయిలో పరిశీలించి మార్కులు నిర్ణయిస్తామన్నారు.