Share News

అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషిచేయాలి

ABN , Publish Date - Nov 26 , 2025 | 11:40 PM

రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని ఎస్పీ సునీల్‌ షెరాన్‌ అన్నారు.

అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషిచేయాలి
నివాళి అర్పిస్తున్న ఎస్పీ, పోలీసు సిబ్బంది

ఎస్పీ సునీల్‌ షెరాన్‌

నంద్యాల టౌన్‌, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని ఎస్పీ సునీల్‌ షెరాన్‌ అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం ఎస్పీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముం దుగా అంబేడ్కర్‌ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమ సమాజం కోసం కృషి చేయాలన్నారు. రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరికి సమాన హక్కులు దక్కాయన్నారు. రాజ్యాంగం విలువలను గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు ప్రమోద్‌కుమార్‌, రామాంజినాయక్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

Updated Date - Nov 26 , 2025 | 11:40 PM