వంద శాతం అక్షరాస్యతకు కృషిచేయాలి
ABN , Publish Date - Aug 21 , 2025 | 11:35 PM
జిల్లాలో వంద శాతం అక్షరాస్యత సాధించేలా ప్రతి అధికారి కృషిచేయాలని అన్నారు.
వయోజన విద్య ఉప సంచాలకులు చంద్రశేఖర్ రెడ్డి
నంద్యాల ఎడ్యుకేషన్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వంద శాతం అక్షరాస్యత సాధించేలా ప్రతి అధికారి కృషిచేయాలని అన్నారు. గురువారం పీజీఆర్‌ఎస్ హాల్‌లో జిల్లా వయోజన ఆధ్వర్యంలో ‘ఉల్లాస్ - అక్షరాంధ్ర’లో భాగంగా ఒక్కరోజు శిక్షణా కార్యక్రమాన్ని జడ్పీ సీఈవో సుబ్బారెడ్డ్డితో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 3.02,050 మందిని వయోజన నిరక్ష్యరా స్యులుగా గుర్తించారన్నారు. మొదటి విడతలో భాగంగా 1.00.686 మం దిని ఈ ఏడాది అక్షరాస్యులుగా మార్చేందుకు సంబంధిత శాఖల సహ కారంతో యాక్షన్ ప్లాన్ రూపొందించామన్నారు. అక్షరా స్యులైన వారికి 2026 మార్చిలో ఎఫ్‌ఎల్‌ఎన్‌ఏ పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణు లైన వారికి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ వారి నుంచి ధ్రువప త్రాలను అందజేస్తామన్నారు. డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్‌రెడ్డి, డీఈవో జనార్ద న్‌రెడ్డి, డ్వామా పీడీ సూర్యనారాయణ, డీఎల్‌డీవో శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.