Share News

స్వచ్ఛమైన గ్రామాలుగా తీర్చిదిద్దాలి

ABN , Publish Date - Oct 17 , 2025 | 11:03 PM

జిల్లాలోని గ్రామాలను స్వచ్ఛమైన గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా పరిషత్‌ సీఈవో నాసరరెడ్డి అన్నారు.

స్వచ్ఛమైన గ్రామాలుగా తీర్చిదిద్దాలి
జడ్పీ సీఈవో నాసరరెడ్డి

జడ్పీ సీఈవో నాసరరెడ్డి

కర్నూలు న్యూసిటీ, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గ్రామాలను స్వచ్ఛమైన గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా పరిషత్‌ సీఈవో నాసరరెడ్డి అన్నారు. శుక్రవారం జడ్పీ ఆవరణలోని జిల్లా శిక్షణ వనరుల కేంద్రంలో ఏపీఎ్‌సఐఆర్‌డీ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు శుభ్రత-పరిశ్రుభత అనే అంశంపై కర్నూలు జిల్లాలోని డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులకు ఒక్కరోజు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ పరిశుభ్రమైన గ్రామాలుగా పంచాయతీలను తీర్చిదిద్దడానికి పని చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటి పచ్చదనాన్ని పెంచాలన్నారు. పారిశుధ్యం, పరిశుభ్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛరథంలో భాగంగా త్వరలో ఒక మండలానికి ఒక స్వచ్ఛరథం ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామ పంచాయతీలను కవర్‌ చేస్తూ పొడి వ్యర్థాలకు బదులుగా నిత్యావసర సరుకులను ప్రజలకు ఇవ్వడం దీని ప్రధాన ఉద్దేశ్యమన్నారు. కార్యక్రమంలో డీపీఆర్‌సీ జిల్లా కో ఆర్డినేటర్‌ మంజులవాణి, శిక్షణ మేనేజర్‌ గిడ్డేష్‌, టీవోటీలు ఎస్‌.అష్రఫ్‌ బాష, పి.జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 17 , 2025 | 11:03 PM