చనిపోయిన ఓటర్ల తొలగింపునకు సహకరించాలి: ఆర్డీవో
ABN , Publish Date - Oct 23 , 2025 | 12:02 AM
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చనిపోయిన ఓటర్ల తొలగింపు కార్యక్రమానికి అన్ని పార్టీల నాయకులు సహకరించాలని నంద్యాల ఆర్డీవో విశ్వనాథ్ కోరారు.
ఆళ్లగడ్డ, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చనిపోయిన ఓటర్ల తొలగింపు కార్యక్రమానికి అన్ని పార్టీల నాయకులు సహకరించాలని నంద్యాల ఆర్డీవో విశ్వనాథ్ కోరారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిచారు. ఆర్డీవో మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడుకి ఓటు నమోదు చేయాలని, అన్ని రాజకీయ పార్టీల నాయకులు తమ బూతుల పరిధిలో ఏజెంట్లను నియమించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి, వివిధ శాఖల అధికారులు, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.